Yadadri: యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.

New Update
Road Accident

Road Accident

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.చౌటుప్పల్‌ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అయితే, పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. 

ఇది కూడా చూడండి: Crime: హైదరాబాద్ లో ఘోరం.. బర్త్ డే రోజు భార్య పీకకోసి..ముక్కలు ముక్కలుగా

Also Read :  ప్రపంచ లీడర్స్‌లో మరోసారి టాప్‌ 1 స్థానంలో నిలిచిన ప్రధాని మోదీ..

Yadadri Road Accident

 సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతిచెందిన వారు ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్న డీఎస్పీలు మేక చక్రధర్‌ రావు, కాంతారావుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

ఇది కూడా చూడండి: Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..

Also Read :  ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఆ రూట్లలో టికెట్ ధరలకు భారీ డిస్కౌంట్

AP Police | chevella Road accident | Choutuppal | Yadadri Bhuvanagiri District | yadadri-bhuvanagiri

Advertisment
తాజా కథనాలు