/rtv/media/media_files/2025/07/26/prabhas-spirit-update-2025-07-26-16-09-31.jpg)
Prabhas Spirit Update
Prabhas Spirit Update: పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టులలో "స్పిరిట్"(Spirit Movie)కి ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ లైన్ అప్ లో చాలా సినిమాలు ఉన్న ఫ్యాన్స్ మాత్రం స్పిరిట్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. "అర్జున్ రెడ్డి"తో తెలుగులో, "యానిమల్"తో హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచానాలు ఉన్నాయి.
సినిమాలో హీరోయిన్‌గా మొదట దీపికా పదుకొణేను తీసుకోవాలని అనుకున్నప్పటికీ, ఆమె పారితోషికం ఎక్కువ అవ్వడం, అలాగే షూటింగ్ టైమింగ్స్ సెట్ కాకపోవడం వల్ల ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. దీంతో ఆ ఛాన్స్ ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రికి దక్కింది.
Also Read:ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
ప్రస్తుతం ప్రభాస్ "ది రాజాసాబ్" షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక వెంటనే "స్పిరిట్" సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వంగా తన తాజా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. "కింగ్డమ్" సినిమా ప్రమోషన్స్‌లో(Kingdom Movie Promotions) భాగంగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గౌతమ్ తిన్ననూరితో జరిగిన ఇంటర్వ్యూలో వంగా(Sandeep Reddy Vanga) పాల్గొన్నారు. ఈ సందర్భంలో విజయ్ - "స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?" అంటూ నేరుగా ప్రశ్నించాడు.
Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు
బ్యాక్ టు బ్యాక్ భారీ షెడ్యూల్స్..
దీనికి స్పందించిన వంగా, సెప్టెంబర్ చివరి వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ న్యూస్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. షూటింగ్ స్టార్ట్ అయినా తర్వాత భారీ షెడ్యూల్స్ బ్యాక్ టు బ్యాక్ ఉండబోతున్నాయని వంగా తెలిపారు.
Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇంతవరకూ ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించకపోవడం, అందులోనూ సందీప్ వంగా డైరెక్షన్ కావడంతో "స్పిరిట్"పై క్రేజ్ మరింతగా పెరిగింది. మరోవైపు ప్రభాస్ “ఫౌజీ” అనే మరో ప్రాజెక్ట్‌తో కూడా ప్రస్తుతం పని చేస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, "స్పిరిట్" కోసం ప్రభాస్ చేసే ట్రాన్స్‌ఫర్మేషన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.