/rtv/media/media_files/2025/07/26/sperm-2025-07-26-16-30-29.jpg)
హైదరాబాద్ లో దారుణం జరిగింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బాగోతం బయటపడింది. పిల్లల కోసం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించింది ఓ మహిళ. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని కోరింది. అందుకు భిన్నంగా వైద్యురాలు ఆమె భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వారి వీర్యకణాలతో మహిళకు సంతానాన్ని కలిగించింది. బేబీ పోలికలు, కలర్ తో పాటుగా రకరకాల అనుమానులు ఉండటంతో సదరు మహిళకు అనుమానం రాగా శిశువుకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించింది. పరీక్షల్లో అది వేరే వారిదిగా తేలింది.
హైదరాబాద్:
— Telangana Velugu (@TOPTeluguNews12) July 26, 2025
సికింద్రాబాద్‌లోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో పోలీసుల తనిఖీలు.
పిల్లల కోసం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించిన మహిళ.
తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని కోరిన లేడీ.
వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించిన వైద్యురాలు.
అనుమానం వచ్చి డీఎన్‌ఏ టెస్ట్…
పోలీసులు కేసు నమోదు
దీంతో బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దంపతుల ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో పోలీసులు తనిఖీలు కూడా చేపట్టారు. ఈ ఘటనపై టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు, సంబంధిత వైద్యురాలిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేవలం వీరికి మాత్రమే చేశారా అనేది విచారిస్తున్నారు. ఎంతకాలం నుంచి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతున్నారో ఆరా తీస్తున్నారు. ఆసుపత్రికి అనుమతులున్నాయా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కలకలం సృష్టించింది.