జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు: సుప్రీంకోర్టు

ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాస్తే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల భావా ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

భారీ ఎన్‌కౌంటర్.. 36మంది మావోలు మృతి!

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 36మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ-నారాయణపూర్‌ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్‌కు వెళ్లనున్న ఎస్. జైశంకర్‌.. ఎందుకో తెలుసా ?

పాకిస్థాన్‌లోని అక్టోబర్ 15, 16వ తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్‌ వెళ్లనున్నారు. 2015 డిసెంబర్ తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

మాలలకు షాక్.. రివ్యూ పిటిషన్స్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ అమలను నిలిపివేయాలని కోరుతూ కొందరూ రివ్యూ పిటిషన్స్ వేశారు. ఈ అంశంపై శుక్రవారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. రివ్యూ పిటిషన్స్‌ను కొట్టివేసింది.   

2047 నాటికి భారత్‌లో దేశీయ ఆయుధాలు: వాయుసేన చీఫ్‌ ఏపీ సింగ్

2047 నాటికి భారత్‌లో.. పూర్తిగా దేశీయ ఆయుధాలే ఉండాలని వాయుసేన చీఫ్ అమర్‌ ప్రీత్ సింగ్ సూచించారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ (LAC) వెంబటి చైనా వేగంగా నిర్మాణాలు చేపడుతోందని తెలిపారు. భారత్‌ కూడా అదేస్థాయిలో సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు.

నీవే నా బుట్టబొమ్మ.. జాక్వెలిన్‌కు సుఖేష్ ఖరీదైన ప్రేమ లేఖ

సుఖేశ్ చంద్రశేఖర్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మరో ప్రేమ లేఖ రాశారు. 'నిజమైన ప్రేయసి, ప్రిన్సెస్, నా బుట్ట బొమ్మ. మన ప్రేమ అద్భుతం' అంటూ తెగ పొగిడేశాడు. ఆమె మ్యూజిక్ వీడియో 'స్టార్మ్ రైడర్' 100M వ్యూస్ పెంచిన వారికి ఖరీదైన బహుమతులు ఇస్తానని ప్రకటించాడు. 

యువతకు కేంద్రం శుభవార్త.. నెలకు రూ.5 వేలు.. ఇలా అప్లై చేయండి!

దేశ యువతకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ‘పీఎం ఇంటర్న్‌షిప్‌’ పథకాన్ని పైలట్‌ ప్రాతిపదికన ప్రారంభించింది. డిగ్రీ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు 2024 అక్టోబరు 12 నుంచి 25 దాకా ‘పీఎం ఇంటర్న్‌షిప్‌’ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Web Stories
web-story-logo yuty వెబ్ స్టోరీస్

'దేవర' పార్ట్-2 కోసం దాచి ఉంచిన ప్రశ్నలివే!

web-story-logo VGGJFGJ వెబ్ స్టోరీస్

ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు ఇవే!

web-story-logo alia w వెబ్ స్టోరీస్

అలియా ‘ఆల్ఫా’ రిలీజ్ డేట్ వచ్చేసింది

web-story-logo Mamitha Baiju3 వెబ్ స్టోరీస్

ప్రేమలో పడేస్తున్న 'ప్రేమలు' బ్యూటీ

web-story-logo Raashii Khanna7 వెబ్ స్టోరీస్

రాశీ సూట్ అదిరింది.! కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న అమ్మడు

web-story-logo drink alcohol7 వెబ్ స్టోరీస్

మద్యం సేవించడానికి సరైన సమయం ఏది..?

web-story-logo dogs1 వెబ్ స్టోరీస్

కుక్కలకు పాలదంతాలు ఉంటాయా..?

web-story-logo iifa-1 వెబ్ స్టోరీస్

'ఐఫా' 2024 అవార్డ్స్ విజేతలు వీళ్లే!

web-story-logo shetty 8 వెబ్ స్టోరీస్

గ్లామర్ డోస్ పెంచేసిన యంగ్ బ్యూటీ.!

web-story-logo ananya pandey k వెబ్ స్టోరీస్

అబ్బా..! అనన్య అందాలు అదుర్స్

రష్యా సంచలన నిర్ణయం.. ఉగ్రజాబితా నుంచి తాలిబన్లు తొలగింపు

2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ల పాలనను అధికారికంగా గుర్తించలేదు. అయితే తాలిబాన్‌ను ఉగ్ర సంస్థల జాబితా నుంచి తొలగించాలని రష్యా నిర్ణయం తీసుకుంది.

పశ్చిమాసియాలో హైటెన్షన్.. ఇజ్రాయెల్‌పై మరో అటాక్ చేయనున్న ఇరాన్‌..

ఇజ్రాయెల్‌పై మరోసారి భారీ దాడులు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆపరేషన్‌కు ట్రూ ప్రామిస్-2 అనే పేరు కూడా పెట్టారు. మూడు రోజుల క్రితం జరిగిన దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. రెండో అటాక్‌తో ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.

పాకిస్థాన్‌కు వెళ్లనున్న ఎస్. జైశంకర్‌.. ఎందుకో తెలుసా ?

పాకిస్థాన్‌లోని అక్టోబర్ 15, 16వ తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్‌ వెళ్లనున్నారు. 2015 డిసెంబర్ తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

'మా శత్రువులను ఓడిస్తాం'.. ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా లెబనాన్‌, పాలస్తీనాలో జరుగుతున్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. తమ శత్రువుల ప్రణాళికలను భగ్నం చేసి ఓడిస్తామన్నారు.

BREAKING: ఘోర ప్రమాదం... 78మంది మృతి!

కాంగో దేశంలో గోమా ప్రాంతంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కివు సరస్సుపై ప్రమాదవశాత్తు బోటు నీటిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 78 మంది మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాల్పులు జరిగిన చోటుకే మళ్లీ రానున్న ట్రంప్‌.. అతిథిగా ఎలాన్ మస్క్

ఈ ఏడాది జులైలో పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఓ ప్రచార సభలో ట్రంప్‌పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ట్రంప్‌ మరోసారి సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా హాజరుకానుండటం విశేషం.

పాక్ క్రికెటర్లకు 4 నెలలుగా జీతాల్లేవా? ఇందులో నిజమెంత?

దాయాది దేశమైన పాకిస్థాన్‌ గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతోంది. ఆ దేశ క్రికెటర్ల పరిస్థతి ఇలానే ఉందని, నాలుగు నెలల నుంచి కనీసం జీతాలు కూడా లేవని వార్తలు వినిపిస్తున్నాయి.

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

TG: GHMC ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఫిబ్రవరి 2026లో GHMC ఎన్నికలు ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. HYDను 4 కార్పొరేషన్‌లుగా విభజిస్తాం..ఇకపై హైదరాబాద్‌కు నలుగురు మేయర్‌లు ఉంటారని చెప్పారు.

కేసీఆర్ సేఫేనా?.. మంత్రి వ్యాఖ్యలతో అనేక అనుమానాలు!

TG: కేసీఆర్‌ను ఏం చేశారో అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఎలా ఉన్నారనే చర్చ రాష్ట్ర ప్రజల్లో మొదలైంది.

నానే బియ్యం బతుకమ్మకు నైవేద్యంగా ఏం పెడతారు..?

బతుకమ్మ 9 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. 4వ రోజు ప్రత్యేకతే నానే బియ్యం బతుకమ్మ.. ఈ రోజు బతుకమ్మ పేర్చే తీరు పెరుగుతుంది. నానే బియ్యం బతుకమ్మకు సమర్పిస్తారు. ఇలా నానే బియ్యం బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరడంతో నాలుగోరోజు వేడుక ముగుస్తోంది.

సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక

TG: సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు. అన్ని రకాల వడ్లకో రూ.500 బోనస్ ఇవ్వాలని, అలాగే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోమని.. పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని వార్నింగ్ ఇచ్చారు.

గ్రూప్-1 నోటిఫికేషన్‌ తీర్పు రిజర్వు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసినట్లు హైకోర్టు ప్రకటించింది. దీంతో నాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో అనేదానిపై గ్రూప్ -1 అభ్యర్థుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.

కేటీఆర్ మౌనం ఎందుకు?

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పెద్దగా స్పందించకపోవడంపై చర్చ సాగుతోంది. సురేఖకు లీగల్ నోటీసులు పంపిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. అయితే.. మాటకు మాటతో వివాదాన్ని పెద్దది చేయకూడదని కేటీఆర్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

దామగుండం ఫారెస్టులో బతుకమ్మ కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

వికారాదాద్‌ జిల్లా దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బహుజన బతుకమ్మకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అక్టోబర్ 6న ఆదివారం జరగనున్న ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమానికి పోలీస్ బందోబస్తు కల్పించాలని ఆదేశించింది. శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేసింది.

విషాదం.. కొడుకు మరణ వార్త విని తల్లి మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్దింశెట్టి ఆదిబాబు (46) అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుడి తల్లి మహాలక్ష్మీ (76) తీవ్ర అస్వస్థకు గురయ్యారు.ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందారు.

'వైఎస్సార్‌ జిల్లా' పేరు మార్చాలి.. చంద్రబాబుకు మంత్రి లేఖ

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'వైఎస్సార్‌ జిల్లా' పేరును మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ రాశారు. వైఎస్సార్‌ జిల్లా పేరును "వైఎస్సార్‌ కడప" జిల్లాగా మార్చాలని ఆయన కోరారు.

తిరుమలలో అపచారం.. టీటీడీ కీలక ప్రకటన!

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని.. ఇది అపచారం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. దీనిని భక్తులు ఎవరు నమ్మొద్దని ఎక్స్‌లో టీటీడీ వివరణ ఇచ్చింది.

ఏపీలో స్విగ్గీ సేవలు బంద్.. ఎందుకంటే!

ఏపీలో స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీకి అమ్మకాలు చేయబోమని తెలిపాయి. బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.

నీ పాపం పండింది జగన్.. టీడీపీ సంచలన ట్వీట్!

AP: జగన్‌పై టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. కల్తీ లడ్డూ విచారణలో సిట్ అవసరం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సిట్ వస్తుంది.. జవాబు చెప్పు జగన్ అంటూ ట్వీట్ చేసింది.

అసలు కల్తీ లేదు.. సిట్ అవసరమే లేదు.. జగన్ షాకింగ్ కామెంట్స్

AP: లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ స్పందించారు. చంద్రబాబు నిజస్వరూపం సుప్రీం కోర్టుకు తెలిసిందని.. అందుకే ఆయన వేసిన సిట్‌ను రద్దు చేసిందని అన్నారు. అసలు లడ్డూలో కల్తీ జరగలేదని.. దీనిపై విచారణకు సిట్ అవసరం లేదని అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు రియాక్షన్.. సత్యమేవ జయతే అంటూ..

తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై CBI, ఏపీ పోలీస్, FSSAI అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్టు చేసిన చంద్రబాబు.. సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ! అని పేర్కొన్నారు.

Vivo Y28s 5G ఫోన్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

వివో కంపెనీ తన వివో వై28ఎస్ 5జీ ధరను తాజాగా తగ్గించింది. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ కాగా ప్రతి వేరియంట్‌పై రూ.500 తగ్గించింది. ఇప్పుడు ఈ వేరియంట్లు కొత్త ధరలతో అందుబాటులో ఉన్నాయి.

లావా అగ్ని3 5G లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవు..!

టెక్ బ్రాండ్ లావా తాజాగా తన లైనప్‌లో ఉన్న అగ్ని3 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిని డ్యూయల్ అమోలెడ్ డిస్‌ప్లేలతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. అక్టోబర్ 9 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

ఉఫ్.. ఉఫ్.. పల్సర్ బైక్‌లపై భారీ డిస్కౌంట్లు, సూపరో సూపర్!

బజాజ్ ఆటో తన పల్సర్ బైక్‌లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్, ఎన్ఎస్ 125, ఎన్ 150, ఎన్ 160, ఎన్‌ఎస్ 200, ఎన్ 250 వంటి మోడళ్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్‌ అందిస్తుంది.

మతిపోగొట్టే ఆఫర్.. కేవలం రూ.2,099కే 5జీ ఫోన్!

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని ధర రూ.7,999 కాగా.. సేల్ సమయంలో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ తగ్గింపులతో కేవలం రూ.2,099కే సొంతం చేసుకోవచ్చు.

వరుసగా నాలుగో రోజు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం కారణంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 1264 పాయింట్ల నష్టంతో 83,002.09 వద్ద ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 82,497.10 వద్ద ఆగిపోయింది.

50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్!

వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరులో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇది 50mp ట్రిపుల్ కెమెరా, 100 వాట్ వైర్డ్, 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నట్లు సమాచారం.

రివర్స్ గేర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌పై 100 కి.మీ మైలేజీ

ఈవా జెడ్‌ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యింది. రివర్స్ గేర్, డిజిటల్ డిస్‌ప్లే, యాంటీ థెప్ట్ అలారం, పార్కింగ్ స్విచ్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. 72వి/ 38 ఏహెచ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌పై 100 కి.మీ మైలేజీ ఇస్తుంది.

తాజా కథనాలు
Image 1 Image 2
Gold Price