విషాదం.. కొడుకు మరణ వార్త విని తల్లి మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్దింశెట్టి ఆదిబాబు (46) అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుడి తల్లి మహాలక్ష్మీ (76) తీవ్ర అస్వస్థకు గురయ్యారు.ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందారు.

New Update
Rajendranagar Crime News

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు మరణవార్త విని ఓ తల్లి అస్వస్థకు గురై మృతి చెందింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మాచవరం అనే గ్రామంలో మద్దింశెట్టి ఆదిబాబు (46) అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దీంతో విషయం తెలుసుకున్న మృతుడి తల్లి మహాలక్ష్మీ (76) తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను 108 వాహనంలో అమలాపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కొడుకు చనిపోయిన కొంతసేపటికే తల్లీ కూడా చనిపోవడంతో మాచవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Also Read: 'వైఎస్సార్‌ జిల్లా' పేరు మార్చాలి.. చంద్రబాబుకు మంత్రి లేఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు