పశ్చిమాసియాలో హైటెన్షన్.. ఇజ్రాయెల్‌పై మరో అటాక్ చేయనున్న ఇరాన్‌..

ఇజ్రాయెల్‌పై మరోసారి భారీ దాడులు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆపరేషన్‌కు ట్రూ ప్రామిస్-2 అనే పేరు కూడా పెట్టారు. మూడు రోజుల క్రితం జరిగిన దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. రెండో అటాక్‌తో ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.

New Update
Iran 2

Iran: పశ్చిమాసియాలో హైటెన్షన్ నెలకొంది. ఇజ్రాయెల్‌పై మరోసారి భారీ దాడులు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆపరేషన్‌కు ట్రూ ప్రామిస్-2 అనే పేరు కూడా పెట్టారు. మూడు రోజుల క్రితం జరిగిన దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. రెండో అటాక్‌తో ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చేసిన దాడిలో ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్‌ను సైతం తన క్షిపణులు చేధించాయని ఇరాన్ చెబుతోంది. అక్కడి ఎయిర్‌బెస్‌పై 32 సార్లు దాడి చేశామని పేర్కొంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ కూడా శుక్రవారం జరిగిన ప్రార్థనల్లో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. తమ శత్రువు ప్రణాళికను భగ్నం చేసి ఓడిస్తామన్నారు. అవసరమైతే మళ్లీ అటాక్ చేస్తామని ప్రకటించారు.    

 

Advertisment
Advertisment
తాజా కథనాలు