నీవే నా బుట్టబొమ్మ.. జాక్వెలిన్‌కు సుఖేష్ ఖరీదైన ప్రేమ లేఖ

సుఖేశ్ చంద్రశేఖర్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మరో ప్రేమ లేఖ రాశారు. 'నిజమైన ప్రేయసి, ప్రిన్సెస్, నా బుట్ట బొమ్మ. మన ప్రేమ అద్భుతం' అంటూ తెగ పొగిడేశాడు. ఆమె మ్యూజిక్ వీడియో 'స్టార్మ్ రైడర్' 100M వ్యూస్ పెంచిన వారికి ఖరీదైన బహుమతులు ఇస్తానని ప్రకటించాడు. 

New Update
frn

Sukesh Chandrasekhar: మనీ లాండరింగ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న సుఖేశ్ చంద్రశేఖర్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మరో ప్రేమ లేఖ రాశారు. నిజమైన ప్రియురాలు, ప్రిన్సెస్, నీవే నా బుట్ట బొమ్మ. మన ప్రేమ అద్భుతం అంటూ తెగ పొగిడేస్తూ లేటర్ రిలీజ్ చేశారు. బేబీ నీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నానంటూ ప్రేమను వ్యక్తపరిచాడు. అంతేకాదు జాక్వెలిన్ అభిమానులకు దీపావళి బోనాంజా ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఆమె మ్యూజిక్ వీడియో స్టార్మ్ రైడర్ ప్రమోషన్‌లో భాగంగా 100 మిలియన్ల చేరుకోవడానికి సహాయపడే వారికి కానుకలు ఇస్తానని చెప్పాడు. దీపావళి రోజున నిర్వహించే లక్కీ డ్రాలో టాప్ 10 విజేతలకు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ తో పాటు సరికొత్త మహీంద్రా థార్ రాక్స్ అందుకుంటారని తెలిపాడు. 

90 మంది విజేతలకు ఐ ఫోన్ 16 ప్రో..

ఈ మేరకు 90 మంది విజేతలకు ఐ ఫోన్ 16 ప్రో ఇస్తాను. థార్ రోక్స్ విజేతల కోసం అన్ని ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ ఫీజులు మేమే భరిస్తాం. ఈ కానుకలు అందుకోవాలంటే కండీషన్లు ఉన్నాయి. ఈ లక్కీ 100 లో పార్టిసిపెంట్ చేయాలనుకునే వారు జాక్వెలిన్ అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ను సబ్ స్క్రిప్షన్ తీసుకుని వారి అధికారిక ఈమెయిల్ లేదా యూట్యూబ్ ఐడీని ఉపయోగించి ఒకలైక్, కామెంట్ ఇవ్వాలి. నవంబర్ 2024 నాటికి స్టార్ రైడర్ 100 మిలియన్ల వ్యూస్ దాటేలా సపోర్టు చేయాలి. లక్కీ డ్రా తీసి బహుమతులు అందిస్తామన్నాడు. 

బోయింగ్ కార్పొరేట్ జెట్ విమానం..

అలాగే జాక్వెలిన్ కోసం బోయింగ్ కార్పొరేట్ జెట్ విమానం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. బోయింగ్ కార్పొరేట్ జెట్.. ఇది తన లిస్టులో ఉందని చెప్పాడు. బేబీ బి కిల్లర్ ఇంటీరియర్ తో ఒక వారం క్రితం బోయింగ్ కార్పొరేట్ జెట్ కొనుగోలు చేసిందని, ఇప్పు బేబీ మీరు కమర్షియల్ విమానాలకు బదులు మీకు సరమైనప్పుడు ఎగురూతూ ఇంట్లోనే ఉన్నట్లు భావించి ఎల్ఏ కి నాన్ స్టాప్ గా ప్రయాణం చేయాలంటూ రాసుకొచ్చాడు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు