మాలలకు షాక్.. రివ్యూ పిటిషన్స్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ అమలను నిలిపివేయాలని కోరుతూ కొందరూ రివ్యూ పిటిషన్స్ వేశారు. ఈ అంశంపై శుక్రవారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. రివ్యూ పిటిషన్స్‌ను కొట్టివేసింది.   

New Update
supreme

ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొందరు ఈ తీర్పు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఎస్సీ వర్గీకరణ అమలును నిలిపివేయాలని కోరుతూ రివ్యూ పిటిషన్స్ వేశారు. ఈ అంశంపై శుక్రవారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. రివ్యూ పిటిషన్స్ కొట్టివేసింది.  '' రివ్యూ పిటిషన్లను పరిశీలించిన తర్వాత.. రికార్డుపై ఎలాంటి లోపం కనిపించలేదు. 2013 నాటి సుప్రీంకోర్టు నిబంధనల XLVII ఆదేశాల ప్రకారం ఏ కేసు కూడా రివ్యూ కోసం లేదు. అందువల్ల ఈ రివ్యూ పిటిషన్లు తిరస్కరించబడతాయని'' సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. 

Also Read: 2047 నాటికి భారత్‌లో దేశీయ ఆయుధాలు: వాయుసేన చీఫ్‌ ఏపీ సింగ్

ఇదిలాఉండగా..  రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీల వర్గీకరణకు ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఎస్సీలలో అత్యంత వెనకబడిన వర్గాల జీవితాలు మెరుగుపరిచేందుకు సబ్‌ కోటా అవసరమని చీఫ్‌ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. 6-1 మెజార్టీతో ఎస్సీ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రం మెజార్టీ తీర్పుతో విభేదించారు. 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు