రివర్స్ గేర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌పై 100 కి.మీ మైలేజీ

ఈవా జెడ్‌ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యింది. రివర్స్ గేర్, డిజిటల్ డిస్‌ప్లే, యాంటీ థెప్ట్ అలారం, పార్కింగ్ స్విచ్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. 72వి/ 38 ఏహెచ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌పై 100 కి.మీ మైలేజీ ఇస్తుంది.

New Update
Zelio EEVA ZX Plus Electric Scooter

దేశీయ ఆటోమొబైల్ రంగం రోజు రోజుకూ పరుగులు పెడుతోంది. కొత్త కొత్త కంపెనీలు భారతదేశంలో దర్శనమిస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీని అందించే స్కూటర్లను లాంచ్ చేస్తూ గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. అందులో జెలియా ఇబైక్స్ కంపెనీ ఒకటి. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో ఇప్పుడిప్పుడే మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. రకరకాల స్కూటర్లను లాంచ్ చేస్తూ ఇతర కంపెనీలకు గట్టి పోటీనిస్తుంది. 

తాజాగా ఈ కంపెనీ ఈవా సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ఈవా జెడ్‌ఎక్స్ ప్లస్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ను ప్రొఫెసనల్స్, స్టూడెంట్స్ సహా పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఈవా జెడ్‌ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 100 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగంతో పరుగులు పెడుతుంది. 

ఇది స్ట్రాంగ్ బిఎల్‌డిసీ (60/72వి) మోటార్‌తో పని చేస్తుంది. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్స్ అందించారు. అదే సమయంలో ముందు వెనుక వైపు హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్‌లను అమర్చారు. కాగా ఈ స్కూటర్‌లో ఎక్కువగా కంఫర్ట్‌కి ప్రాధాన్యతను ఇచ్చారు. ఇకపోతే ఈ స్కూటర్ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. 

ఈ ఈవా జెడ్‌ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. రివర్స్ గేర్, ఆటో రిపేర్ స్విచ్, డిజిటల్ డిస్‌ప్లే, యాంటీ థెప్ట్ అలారం, పార్కింగ్ స్విచ్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి. కంపెనీ ఈ స్కూటర్‌ని ఒక ఏడాది లేదా 10,000 కి.మీ వారంటీతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో గ్రే, బ్లూ, వైట్, బ్లాక్ వంటివి ఉన్నాయి. 

బ్యాటరీ వేరియంట్లు - ధర

ఇక ఈ స్కూటర్ వేరియంట్ల విషయానికొస్తే.. ఇది అనేక బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. అందులో 60వి/32 ఏహెచ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ గల స్కూటర్ రూ.67,500 ఎక్స్‌షోరూమ్ ధరను కలిగి ఉంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై దాదాపు 60 నుంచి 70 కి.మీ మైలేజీ అందిస్తుంది. అదే సమయంలో 72వి/ 32 ఏహెచ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ గల వేరియంట్ ధర రూ.70,000గా నిర్ణయించబడింది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 80 కి.మీ మైలేజీ అందిస్తుంది.

ఇక 60వి/ 38 ఏహెచ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ గల వేరియంట్ ధర రూ.73,300గా ఉంది. ఇది సింగిల్ ఛార్జింగ్ పై 80 కి.మీ మైలేజీ అందిస్తుంది. అలాగే 72వి/ 38 ఏహెచ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్ రూ.77,000గా ఉంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 100కి.మీ మైలేజీ ఇస్తుంది. ఇక దీని చివరి 60వి / 30 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్ రూ.90,500గా నిర్ణయించబడింది. ఇది సింగిల్ ఛార్జింగ్‌తో 80 కి.మీ మైలేజీ అందిస్తుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు