/rtv/media/media_files/Hdgm1dddjMHhf7Ww5V8L.jpg)
TDP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. కల్తీ లడ్డూ విచారణలో సిట్ అవసరం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సిట్ వస్తుంది.. జవాబు చెప్పు జగన్ అంటూ ట్వీట్ చేసింది. కాగా తిరుమల లడ్డూ కల్తీ అంశంపై తమ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో పలు ప్రశ్నలను సంధించింది.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, బావ ధర్మారెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డిలు అడ్డంగా బుక్కయ్యారు.#NeePaapamPandindiJagan#YCPAnimalFatInTirumalaLaddu#FekuJagan#Tirumala#TirumalaLaddu#AndhraPradeshpic.twitter.com/57agNE5VIi
— Telugu Desam Party (@JaiTDP) October 4, 2024
జగన్‌పై టీడీపీ ప్రశ్నల దాడి...
- ఏడాదికి 15 టన్నుల సరఫరా సామర్థ్యం మాత్రమే ఉన్న ఏఆర్ డెయిరీకి ఆరు నెలల్లో 1000 టన్నులు సప్లై చేయమని, ఆర్డర్ ఎలా ఇచ్చావ్?
* ఏఆర్ డెయిరీ నుంచి తిరుమలకి 500 కి.మీ.ల దూరమే అయినప్పుడు, ట్యాంకర్ రావటానికి 9 రోజులు ఎందుకు పట్టింది? ఎక్కడెక్కడ తిరిగి కల్తీ చేసి వచ్చింది?
* 50 ఏళ్ళుగా తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని ఎందుకు వద్దన్నావు?
* ఏఆర్ డెయిరీ ప్లాంట్ లో నెయ్యి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ 6 టన్నులు అయితే, 16 టన్నుల కెపాసిటీ ఉన్న నెయ్యి ట్యాంకర్ తిరుమలకు ఎలా వచ్చింది?తిరుమల శ్రీవారితో పెట్టుకున్నావు. లడ్డూ కల్తీ చేశావు. నీ పాపం పండింది.#NeePaapamPandindiJagan#YCPAnimalFatInTirumalaLaddu#FekuJagan#Tirumala#TirumalaLaddu#AndhraPradeshpic.twitter.com/qYS3iQaybD
— Telugu Desam Party (@JaiTDP) October 4, 2024
* 2023 ఫిబ్రవరిలో వైవీ సుబ్బారెడ్డి కిలో నెయ్యి రూ.496.90 చొప్పున కొన్నాడు. 2024 మార్చిలో భూమన కరుణాకరరెడ్డి రూ.320కి కొన్నాడు... ఏడాది కాలంలో నెయ్యి ధర 55% ఎందుకు పడిపోయింది?
* ఉత్పత్తి సామర్థ్యం, సరఫరా సామర్థ్యం, స్టోరేజ్ సామర్థ్యం లేని ఏఆర్ డెయిరీకి టెండర్ ఎందుకిచ్చావు?
కల్తీ నెయ్యి వాడామని స్వయంగా టీటీడీ ఈవో చెప్తుంటే.. @ysjagan మాత్రం వాడలేదు అంటూ విరుద్ధంగా ప్రచారం చేస్తున్నాడు
— Telugu Desam Party (@JaiTDP) October 4, 2024
నీ కల్తీ బుద్ధి బయట పడగానే, మరీ ఇంత దిగజారుతావా జగన్ రెడ్డి ? #NeePaapamPandindiJagan#YCPAnimalFatInTirumalaLaddu#FekuJagan#Tirumala#TirumalaLaddu… https://t.co/sfF7t7xlQApic.twitter.com/uv19CyP0Jz
* వైష్టవి డెయిరీ నుంచి అదే ట్యాంకర్ ఏఆర్ డెయిరీకి ఎందుకు వెళ్ళింది?... అక్కడ నుంచి అదే వే బిల్ తో తిరుమల ఎందుకు వచ్చింది?
* టెండర్ నిబంధనలు ఎందుకు మార్చావు?... ఏఆర్ డెయిరీకి ఇవ్వడం కోసం, ఎందుకు నిబంధనలు తుంగలో తొక్కావు?
* 2023లో కిలో నెయ్యి రూ.428కి ఇవ్వలేమన్న ఏఆర్ డెయిరీ... 2024 మార్చిలో రూ.320కే ఇస్తామని ఎలా ముందుకు వచ్చింది?
* పవిత్ర తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఎందుకు కలిపావు? అంటూ ఎక్స్ లో జగన్ పై టీడీపీ ప్రశ్నల దాడికి దిగింది.
కల్తీ జగన్ కట్టు కథలు కట్టిపెట్టు.. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో వస్తోంది సిట్..
— Telugu Desam Party (@JaiTDP) October 4, 2024
నీ కల్తీ గుట్టు చేస్తుంది రట్టు..#NeePaapamPandindiJagan#YCPAnimalFatInTirumalaLaddu#FekuJagan#Tirumala#TirumalaLaddu#AndhraPradeshpic.twitter.com/BtMaILnepK