మతిపోగొట్టే ఆఫర్.. కేవలం రూ.2,099కే 5జీ ఫోన్!

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని ధర రూ.7,999 కాగా.. సేల్ సమయంలో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ తగ్గింపులతో కేవలం రూ.2,099కే సొంతం చేసుకోవచ్చు.

New Update
poco m6

50ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమిన్సిటీ ప్రాసెసర్, ఇంకా ఎన్నో అధునాతన.. అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ని అత్యంత చీప్ ధరకే సొంతం చేసుకోవాలనుకుంటున్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 నడుస్తోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఒక కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చౌక ధరలోనే కొనుక్కోవచ్చు. 

POCO M6 5G Offers

ఈ సేల్‌లో POCO M6 5G స్మార్ట్‌ఫోన్‌పై కనీ వినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ కాగా.. అందులో బేస్ 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.11,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 33 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.7,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపు రూ.4,000 తగ్గింపు లభిస్తుందన్న మాట. 

ఇది కూడా చదవండి: 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్!

ఇది కాకుండా భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ క్రెడిట్ ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.500 పొందొచ్చు. ఇది కాకుండా యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు నాన్ ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.500 తగ్గింపు లభిస్తుంది. వీటితో మరింత తక్కువకే ఫోన్‌ను కొనుక్కోవచ్చు. ఇది కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. దాదాపు రూ.5,400 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. దీంతో బ్యాంక్ తగ్గింపు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో కేవలం రూ.2,099లకే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. 

POCO M6 5G Specifications

పోకో ఎం6  5జీ స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ సిమ్ స్లాట్‌ను అమర్చారు. MediaTek Dimensity 6100+ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP కెమెరాను కలిగి ఉంది. ఇది AI మద్దతుతో వస్తుంది. 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతో పాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

Also Read :  బీరూట్‌ పై ఇజ్రాయెల్ దాడి.. విమానాశ్రం వద్ద భారీ పేలుడు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు