2047 నాటికి భారత్‌లో దేశీయ ఆయుధాలు: వాయుసేన చీఫ్‌ ఏపీ సింగ్

2047 నాటికి భారత్‌లో.. పూర్తిగా దేశీయ ఆయుధాలే ఉండాలని వాయుసేన చీఫ్ అమర్‌ ప్రీత్ సింగ్ సూచించారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ (LAC) వెంబటి చైనా వేగంగా నిర్మాణాలు చేపడుతోందని తెలిపారు. భారత్‌ కూడా అదేస్థాయిలో సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు.

New Update
AP Singh

వాయుసేన చీఫ్, ఎయిర్ మార్షల్ అమర్‌ ప్రీత్ సింగ్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి భారత్‌లో.. పూర్తిగా దేశీయ ఆయుధాలే ఉండే దిశగా వాయుసేన పరిశీలిస్తోందని అన్నారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ (LAC) వెంబటి చైనా వేగంగా మౌలిక వసతులు, నిర్మాణాలు చేపడుతోందని అన్నారు. ఇప్పడు భారత్‌ కూడా అదేస్థాయిలో సరిహద్దుల వద్ద వేగంగా సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేస్తోందని పేర్కొన్నారు. భద్రతా దళాల వద్ద దేశీయా తయారీ ఆయుధ వ్యవస్థలు ఉండటం ముఖ్యమన్నారు. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోవాలంటే 2047 నాటికి భారత దళాల వద్ద పూర్తిగా దేశీయ ఆయుధాలే ఉండాలని సూచనలు చేశారు. త్వరలో ఎయిర్‌ఫోర్స్‌ డే రానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.   

Also Read: నీవే నా బుట్టబొమ్మ.. జాక్వెలిన్‌కు సుఖేష్ ఖరీదైన ప్రేమ లేఖ

అదే సరైన మార్గం

'' రష్యా నుంచి మూడు యూనిట్ల ఎస్‌-400 వ్యవస్థలు దిగుమతి అయ్యాయి. వచ్చే ఏడాది మిగిలిన వాటిని కూడా అందజేస్తామని మాస్కో చెప్పింది. ప్రస్తుతం భారత్‌.. 114 విమానాల కోసమే డీఏపీ-2020 అంశాన్ని చూస్తోంది. కానీ.. వాటిని దేశీయంగా తయారుచేస్తేనే బాగుంటుందని భావిస్తున్నాం. 2047 నాటికి వాయుసేన పూర్తిగా దేశీయ ఆయుధాలతోనే ఉండాల్సి అవసరం ఉంది. ప్రస్తుతం మనవద్ద ఎక్కువ సంఖ్యలో ఆకాశ్ క్షిపణులు ఉన్నాయి. ఇప్పుడు ఆకాశ్ ఎన్‌జీ కోసం చూస్తున్నాం. మీరు బయటి ఆయుధాలపై ఆధారపడితే.. అవి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. యుద్ధం చేయాలంటే కనీసం 200 నుంచి 300 క్షిపణులు ప్రయోగించాల్సి ఉంటుంది. అందుకే వాటన్నింటినీ దేశీయంగా తయారుచేసుకోవడమే సరైన మార్గం. 

ఇప్పటికే తేజస్ యుద్ధ విమానంలో జాప్యం జరిగింది. మనం ప్రతీఏడాది 24 యుద్ధ విమానాలు ఉత్పత్తి చేయగలిగితే.. దాన్ని నివారించవచ్చు. ప్రైవేటు సంస్థల వైపు మనం మళ్లాల్సిన అవసరం ఉంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)కు కూడా పరిమితులు ఉన్నాయి. ఉత్పత్తిలో సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రైవేటు రంగం చాలా అవసరమని'' ఏపీ సింగ్ వెల్లడించారు. అలాగే ఇప్పటిదాకా తూర్పు లడఖ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. మనకు నయోమాలో సరికొత్త ఎయిర్‌ఫీల్డ్‌లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇప్పటికే మనకున్న సామర్థ్యాలను బలోపేతం చేసుకున్నామని.. సెంట్రల్ సెక్టార్‌లో ఎయిర్ ఫీల్డ్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు