50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్!

వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరులో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇది 50mp ట్రిపుల్ కెమెరా, 100 వాట్ వైర్డ్, 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నట్లు సమాచారం.

New Update
OnePlus 13

వన్‌ప్లస్ కంపెనీ పలు ఫోన్లను లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హవా చూపిస్తుంది. అతి తక్కువ సమయంలోనే అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటిగా పేరు పొందింది. ఇప్పటికే తన లైనప్‌లో ఉన్న పలు మోడళ్లను లాంచ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు మరొక ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 

OnePlus 13

OnePlus తన లైనప్‌లో ఉన్న OnePlus 13 స్మార్ట్‌ఫోన్‌ని ఈ నెల అంటే అక్టోబర్ నెలాఖరులో లాంచ్ చేయనుంది. ఇటీవలే కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన ఫొటో టీజర్‌ను రిలీజ్ చేసింది. అందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4ని ప్రాసెసర్‌గా అందించినట్లు తెలిసింది. అదే సమయంలో ఈ ఫోన్ 6.8 అంగుళాల డిస్‌ప్లే 2కె రిజల్యూషన్‌ను కలిగి ఉనట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: అరాచకమైన ఆఫర్.. స్మార్ట్‌వాచ్ ధరకే కొత్త 5జీ మొబైల్

తాజాగా ఒక టిప్‌స్టర్ ఈ ఫోన్‌కి సంబంధించిన బ్యాటరీ సహా ఇతర ఫీచర్ల గురించి లీక్ చేశాడు. దాని ప్రకారం.. ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని వెల్లడించాడు. అలాగే ఈ ఫోన్ 100 వాట్ వైర్డు, 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని తెలిపాడు. ఇది 2కె రిజల్యూషన్‌తో రానున్నట్లు పేర్కొన్నాడు. 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల LTPO BOE X2 మైక్రో క్వాడ్ కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని లీక్ తెలిపింది.

ఇక దీని బ్యాటరీ విషయానికొస్తే.. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. 50 మెగాపిక్సెల్ LYT-808 ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని చెప్పబడింది.

ముఖ్యంగా ఈ OnePlus 13 ఫోన్ 24 GB వరకు RAM కలిగి ఉండవచ్చని ఒక పోస్ట్‌లో వెల్లడైంది. దీని కారణంగా ఎక్కువ మెమరీని కలిగి ఉండటం వల్ల AI ఫీచర్లతో రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇది గేమింగ్ సమయంలో కూడా మంచి అనుభవాన్ని అందిస్తుందని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Also Read :  కుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డికి గాయాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు