🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

Also Read: భారతీయ విద్యార్థిపై అమెరికా అధికారుల కర్కశం.. వీడియో వైరల్

RTV LIVE Telugu News App
RTV న్యూస్ యాప్(RTV NEWS APP) ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ యాప్ ను అప్డేట్ చేసుకోవచ్చు. 

Also Read: తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం

RTV News App Download Links:

ఆండ్రాయిడ్ వినియోగదారులు(Android) - https://t.co/B1FaPB6Zsr
IOS వినియోగదారులు - https://t.co/4nRQaLbtfv

  • Jun 10, 2025 21:08 IST

    మాగంటి గోపీనాథ్ పై దాఖలైన పిటిషన్లు క్లోజ్

    మాగంటి గోపీనాథ్‌ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగించింది. నామినేషన్‌ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో గోపీనాథ్‌  తప్పుడు సమాచారం ఇచ్చారంటూ  కాంగ్రెస్‌ నేత అజహరుద్దీన్‌, నవీన్‌ యాదవ్‌ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లుగా దాఖలు చేశారు.

    maganti close



  • Jun 10, 2025 21:07 IST

    గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల

    APPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. నెలరోజుల్లోనే ఈ ఫలితాలను బోర్డు రిలీజ్ చేసింది.  1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 

    APPSC Group 1
    APPSC Group 1

     



  • Jun 10, 2025 19:03 IST

    అనుమానంతో భార్యను ఉరేసి చంపి.. తర్వాత ఏం చేశాడంటే!

    సరూర్‌నగర్‌ లో దారుణ ఘటన వెలుగుచూసింది. మరియాదాస్‌ అనే వ్యక్తి తన భార్య అమృతను చున్నీతో ఉరేసి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే అమృత హత్యకు కారణమని తెలుస్తుంది.

    Read More



  • Jun 10, 2025 18:27 IST

    ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ డేట్‌ ఫిక్స్..

    తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. జులై మొదటివారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వి.బాలకిష్టారెడ్డి చెప్పారు. ఆగస్టు 14లోపు ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

    Engineering Counselling
    Engineering Counselling

     



  • Jun 10, 2025 17:54 IST

    కోట శ్రీనివాసరావుకు ఏమైంది?

    ఈ రోజు ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావును నిర్మాత బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే.. ఆ ఫొటోలో కోటా శ్రీనివాసరావు కాలుకు కట్లు కట్టి ఉంది. దీంతో పాపం.. కోటకు ఏమైందంటూ నెటిజెన్టు కామెంట్లు పెడుతున్నారు.

    Kota Srinivasa Rao
    Kota Srinivasa Rao

     



  • Jun 10, 2025 17:54 IST

    ఆగిపోయిన చాట్‌ జీపీటీ



  • Jun 10, 2025 17:07 IST

    అలెర్ట్‌.. 3 రోజులు భారీ వర్షాలు

    తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

    Telangana Rain update
    Telangana Rain update Photograph: (Telangana Rain update)

     



  • Jun 10, 2025 16:04 IST

    భారీ కాల్పులు.. 11 మంది విద్యార్థులు మృతి

    ఆస్ట్రియాలో విషాదం చోటుచేసుకుంది. గ్రాజ్‌ సిటీలోని లెండ్‌ ప్రాంతాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.

    11 People killed in Graz school shooting , Austria
    11 People killed in Graz school shooting , Austria

     



  • Jun 10, 2025 16:04 IST

    అమ్మకానికి ఆర్సీబీ.. షాక్‌లో అభిమానులు!

    ఆర్‌సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ యాజమాన్యం డయాజియో ఫ్రాంచైజీని విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోందట. ఆర్‌సీబీ జట్టును పూర్తిగా లేదా కొంత భాగాన్ని విక్రయించేందుకు డయాజియో ప్రయత్నిస్తుంది.

    rcb-sale



  • Jun 10, 2025 16:03 IST

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో బస్ భవన్ ముట్టడించేందుకు ఆమె  ప్రయత్నించారు. దీంతో కవితను అదుపులోకి తీసుకుని చంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    kavitha-arrest



  • Jun 10, 2025 13:01 IST

    Meghalaya Honeymoon Murder Case: భర్తను లేపేయడానికి రూ.20 లక్షల డీల్.. హనీమూన్ కేసులో సంచలన నిజాలు!

    MPలోని ఇండోర్‌కు చెందిన రాజారఘువంశీ హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ‘‘రాజాని చంపడానికి సోనమ్ రూ.20 లక్షలు ఇస్తానని చెప్పింది. వెంటనే రాజాను చంపేయాలంది. రూ.15వేలు అడ్వాన్స్‌ ఇచ్చింది’’ అని పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు.

    Meghalaya Honeymoon Murder Case
    Meghalaya Honeymoon Murder Case

     



  • Jun 10, 2025 13:00 IST

    Ap Crime News: ఏపీలో దుర్మార్గపు సీఐ.. టార్చర్ తట్టుకోలేక విషం తాగిన మహిళ! (వీడియో)

    నెల్లూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చేజర్ల మండలం ఆదురుపల్లికి చెందిన జమిల అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటి వివాదంలో జోక్యం చేసుకుని సంగం సీఐ వేమారెడ్డి తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. తన చావుకు కారణం సీఐ అని తెలిపింది.

    Nellore CI Vemareddy Harassment woman Suicide attempt
    Nellore CI Vemareddy Harassment woman Suicide attempt

     



  • Jun 10, 2025 13:00 IST

    Honeymoon Murder Case: హనీమూన్ కపుల్ పెళ్లి వీడియో.. సోనమ్ షాకింగ్ రియాక్షన్స్ చూశారా?

    ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ-సోనమ్‌ పెళ్లివీడియో వైరల్‌గా మారింది. అందులో రాజా హ్యీపీగా ఉండటం చూడవచ్చు. కానీ సోనమ్ మాత్రం తలపైకి ఎత్తకుండా, ముఖంలో చిరునవ్వు లేకుండా కనిపించింది. పెళ్లికి నో చెప్పడం కంటే హత్య చేయడం సులభమా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

    Meghalaya Honeymoon couple marriage (1)
    Meghalaya Honeymoon couple marriage (1)

     



  • Jun 10, 2025 12:59 IST

    Ap Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి

    ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద లారీని వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టింది. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

    accident
    accident

     



  • Jun 10, 2025 12:59 IST

    HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?

    ఇవాళ నందమూరి నటసింహం బాలకృష్ణ 65వ బర్త్ డే. ఈ సందర్భంగా 1974 నాటి తాతమ్మ కల సినిమా నుంచి 2025లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ దాకా ఆయన కెరీర్‌, పర్సనల్ లైఫ్‌లోని పలు విషయాల గురించి తెలుసుకుందాం.

    Balakrishna Birthday
    Balakrishna Birthday

     



  • Jun 10, 2025 12:58 IST

    Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో సోనమ్‌ ప్రియుడు (వీడియో)

    రాజా రఘువంశీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా మృతదేహం ఇండోర్‌కు వచ్చిన రోజు సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా కూడా అక్కడే ఉన్నాడని తెలిసింది. అతను రాజా అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడని రఘవంశీ పొరుగువారు షాకింగ్ విషయాలు చెప్పారు.

    Meghalaya honeymoon murder
    Meghalaya honeymoon murder

     



  • Jun 10, 2025 12:57 IST

    Nicholas Pooran Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ బ్యాటర్ పూరన్ రిటైర్మెంట్

    వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కష్టంగా ఉన్నప్పటికీ, చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పూరన్ 10 టీ 20ల్లో 2,275 రన్స్ చేయగా వన్డేల్లో 1983 పరుగులు చేశాడు.

    Nicholas Pooran retired
    Nicholas Pooran retired

     



  • Jun 10, 2025 12:24 IST

    USA: ట్రంప్ తప్పు చేశాడా.. అధికారాన్ని దుర్వినియోగం చేశాడా..

    లాస్ ఏంజెలెస్ నిరసనలు ఇప్పుడు కాలిఫోర్నియా ప్రభుత్వం, ట్రంప్ మధ్య గొడవగా మారిపోయింది. నేషనల్ గార్డ్స్ ను తమను అడక్కుండా పంపించారంటూ అక్కడి అటార్నీ జనరల్ రాబ్ బోంటా ఫెడరల్ దావా వేశారు. గార్డ్స్ ను పంపించే ముందు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని ఆరోపించారు.

    usa
    California sues Trump over guard deployment

     



  • Jun 10, 2025 12:23 IST

    Stock Markets: లాభాల్లో స్టాక్ మార్కెట్లు..100 పాయింట్లతో సెన్సెక్స్

    అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా దేశీ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 50 పెరిగాయి. ఐటీ, ఇంధన స్టాక్స్ బాగా బూమ్ లో ఉన్నాయి. 

    stock market
    stock market

     



  • Jun 10, 2025 12:23 IST

    Apple iOS 26: లిక్విడ్ గ్లాస్ డిజైన్ తో యాపిల్ ప్రోడెక్ట్స్..IOS 26 లాంచ్

     యాపిల్ ఎప్పటికప్పుడు తన ప్రోడెక్ట్స్ ను అప్ డేట్ చేసుకుంటూ వెళుతోంది. ప్రతీ ఏడాది ఏదో ఒక కొత్త వెర్షన్ ను తీసుకువస్తూనే ఉంది. తాజాగా తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌ iOS 26ను లాంచ్ చేసింది. 

    ios
    New IOS 26

     



  • Jun 10, 2025 12:22 IST

    California: నేషనల్ గార్డ్ విషయంలో ట్రంప్ పై దావా వేసిన కాలిఫోర్నియా ప్రభుత్వం

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కాలిఫోర్నియా ప్రభుత్వం ఫెడరల్ దావా వేసింది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ప్రకటించారు. నేషనల్ గార్డ్స్ ను పంపించే ముందు అధ్యక్షుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పారు.

    la
    Cafornia government sued president trump on national guards issue

     



  • Jun 10, 2025 07:07 IST

    LA: మొన్న నేషనల్ గార్డ్స్..ఈరోజు 700 మంది మెరైన్స్..మరింత రణరంగంగా లాస్ ఏంజెల్స్

    లాస్ ఏంజెల్స్ లో నిరసనలు సెగలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దానికి తగ్గట్టే అధ్యక్షుడు ట్రంప్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. మొన్న 2వేల మంది నేషనల్ గార్డ్స్ పంపిస్తే ఈరోజే 700 మంది యాక్టివ్ డ్యూటీ మెరైన్స్ ను రంగంలోకి దింపారు.

    LA
    700 Marines Deployed To Los Angeles

     



  • Jun 10, 2025 07:06 IST

    Heat Wave Alert: ఏపీలో సూర్యుడి ప్రతాపం.. నేడు ఈ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు!

    APలో ఇవాళ 15 జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని AP విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, అల్లూరి, మన్యం, కోనసీమ, కాకినాడ, తూగో, పగో, NTR, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో ఎండ తీవ్రత ఉండనున్నట్లు తెలిపింది.

    andhra pradesh heat wave alert
    andhra pradesh heat wave alert

     



  • Jun 10, 2025 06:33 IST

    Axiom 4 mission: శుభాన్షు శుక్లా ISS యాత్ర మళ్లీ వాయిదా

    యాక్సియమ్‌ 4 మిషన్‌ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. ఫాల్కన్‌-9 రాకెట్‌ మంగళవారం ఉదయం నిొంగులోకి వెళ్లాలి. కానీ భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మార్చినట్టు ఇస్రో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

    Subhanshu Shukla



  • Jun 10, 2025 06:32 IST

    Partho Ghosh: విషాదం.. గుండెపోటుతో దర్శకుడు కన్నుమూత

    ప్రముఖ భాలీవుడ్ సినీ దర్శకుడు పార్థో ఘోష్ తుదిశ్వాస విడిచారు. ఆయన ముంబైలో నిన్న సాయంత్రం 75 సంవత్సరాల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయన బౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.  

    bollywood director Partho Ghosh Passes Away At 75 years
    bollywood director Partho Ghosh Passes Away At 75 years

     



  • Jun 10, 2025 06:31 IST

    MS Dhoni: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ధోనీ..ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు..

    భారత క్రికెటర్లలో ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక వ్యక్తి ధోనీ. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలోకి అతడికి చోటు కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో ఏడుగురికి స్థానం ఇవ్వగా ఐదుగురు పురుష క్రికెటర్లు, ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు. 

    Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1)
    Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1) Photograph: (Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1))

     



Advertisment
Advertisment
తాజా కథనాలు