/rtv/media/media_files/2025/06/10/lhyiK6I6GK4JBsB6XAg7.jpg)
Nicholas Pooran retired
Nicholas Pooran Retirement:
మరో స్టార్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. వెస్టిండీస్(Westindies) విధ్వంసక బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘ఈ నిర్ణయం చాలా కష్టంగా ఉంది.
Also Read : Bengaluru: రిలేషన్ షిప్ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..
అయినప్పటికీ చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని అందులో పేర్కొన్నారు. ఇక ఈ 29 ఏళ్ల బ్యాటర్ 106 T20ల్లో 2,275 పరుగులు చేశారు. అలాగే 61 వన్డేల్లో 1,983 రన్స్ చేశారు. వాటిలో 3 సెంచరీలు ఉన్నాయి. కాగా ఇటీవల ఐపీఎల్ 2025 సీజన్‌లో తన పవర్ ఏంటో చూపించారు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. రిషబ్ పంత్ జట్టు తరపున 14 మ్యాచ్‌ల్లో దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో 524 పరుగులు సాధించాడు.
Also Read: లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)
తన పోస్టులో ఇలా రాసుకొచ్చారు. ‘‘చాలా ఆలోచించి, ఆలోచించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి నా రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. మేము ఇష్టపడే ఈ ఆట చాలా ఇచ్చింది. ఇస్తూనే ఉంటుంది. ఆనందం, ఉద్దేశ్యం, మరపురాని జ్ఞాపకాలు, వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం.
Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్
ఆ మెరూన్ రంగు ధరించడం, గీతం కోసం నిలబడటం, నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ నా దగ్గర ఉన్నవన్నీ ఇవ్వడం. నిజంగా మాటల్లో చెప్పడం కష్టం. కెప్టెన్‌గా జట్టును నడిపించడం నేను ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంచుకునే గౌరవం’’ అని రాసుకొచ్చారు.
Nicholas Pooran retires from international cricket.
— Caribbean Cricket Podcast (@CaribCricket) June 9, 2025
We warned people it was coming.
Never a dull day! pic.twitter.com/TiIndrFdt9
Nicholas Pooran has retired from all forms of international cricket at the age of 29.
— Israr Ahmed Hashmi (@IamIsrarHashmi) June 10, 2025
Wild guess that an IPL franchise has signed him up & he'll be playing for them in multiple leagues. Klassen, Maxwell & Pooran - the Big 3 of power-hitting retired.pic.twitter.com/bKA7mkxdaC
Also Read : తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం