HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?

ఇవాళ నందమూరి నటసింహం బాలకృష్ణ 65వ బర్త్ డే. ఈ సందర్భంగా 1974 నాటి తాతమ్మ కల సినిమా నుంచి 2025లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ దాకా ఆయన కెరీర్‌, పర్సనల్ లైఫ్‌లోని పలు విషయాల గురించి తెలుసుకుందాం.

New Update
Balakrishna Birthday

Balakrishna Birthday

HBD Balakrishna: ‘‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు.. నిన్ను తలచుకున్న వారు.. లేచి నుంచిని మొక్కుతారు.. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీవయ్య.. జై బాలయ్య జై బాలయ్య’’ ఈ సాంగ్ వింటే నందమూరి ఫ్యాన్స్, సినీ అభిమానుల్లో ఉత్సాహం ఉట్టి పడుతుంది. అతడు మీసం మెలేసి డైలాగ్ చెబితే తెలుగుదనం పరిమళిస్తుంది. తెరమీదే కాదు.. తెర వెనుక కూడా పద్యాలు, శ్లోకాలను అవలీలగా చెప్పగలరు. 

Also Read :  Bengaluru: రిలేషన్ షిప్‌ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ సినిమాలకు బాలయ్య బాబు కేరాఫ్ అడ్రస్. అందులో నో డౌట్. అయితే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా?.. ఎందుకంటే ఇవాళ నందమూరి నటసింహం బాలకృష్ణ 65వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నందమూరి నటసింహం 1974 నాటి తాతమ్మ కల సినిమా నుంచి 2025లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ దాకా ఆయన కెరీర్‌, పర్సనల్ లైఫ్‌లోని పలు విషయాల గురించి తెలుసుకుందాం. 

Also Read: లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్‌ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)

తారక రామారావు వారసుడిగా 

నందమూరి తారక రామారావు వారసుడిగా బాలయ్య బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నారు. ఇప్పటివరకు ఆయన 109 సినిమాల్లో నటించి ఎన్నో రికార్డులను నెలకొల్పారు. మరెందరో స్టార్ల రికార్డులను బ్రేక్ చేశారు. బాక్సాఫీసును షేక్ చేయాలంటే బాలయ్య బాబు సినిమా రావాల్సిందే అనే విధంగా తన క్రేజ్ మార్చుకున్నాడు. 

Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్

‘తాతమ్మ కల’తో సినీ కెరీర్

నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10న చెన్నైలో ఎన్‌టీఆర్- బసవతారకం దంపతులకు 6వ కుమారుడిగా జన్మించారు. ఆయన తన సినిమా కెరీర్‌ను ‘తాతమ్మ కల’తో ప్రారంభించారు. 1974లో ఎన్‌టీఆర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇదే బాలయ్యబాబు మొదటి సినిమా. అప్పటికి ఆయన వయస్సు 14 ఏళ్లు. ఈ సినిమాలో ఆయన సహాయ నటుడిగా కనిపించారు. 

1984లో హీరోగా ఎంట్రీ

ఆ తర్వాత 1984లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  ‘సాహసమే జీవితం’ సినిమాతో తొలిసారిగా హీరోగా నటించారు. ఇలా డిఫరెంట్ సినిమాలు, డిఫరెంట్ రోల్స్‌లో దాదాపు 52 ఏళ్లుగా తెలుగు సినీరంగంలో తనదైన శైలిలో ప్రత్యేక ముద్రవేసుకున్నారు. ఒక ఇప్పటివ‌ర‌కు బాల‌య్య 109 సినిమాల్లో నటించగా.. అందులో 72 సినిమాలు వంద రోజుల‌కుపైగా ఆడాయి. ఆయన పేరిట చెరపలేని ఎన్నో రికార్డులు ఉన్నాయి. 17 సినిమాల్లో డ్యూయల్ రోల్‌లో నటించిన రికార్డు బాలయ్య ఒక్కరికే ఉంది. అంతేకాకుండా చిత్ర పరిశ్రమకు, సమాజానికి ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ ఏడాది పద్మవిభూషణ్​తో సత్కరించింది. 

Also Read :  తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం

మూడుసార్లు వరుసగా MLA

మరోవైపు రాజకీయాల్లోనూ ఆయన తన సత్తా ఏంటో చాటుకుంటున్నారు. దాదాపు మూడు సార్లు MLAగా గెలిచి.. తనకు పోటీ లేదని నిరూపించుకున్నారు. 2014 నుంచి హిందూపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచారు. ఒకవైపు జనం మెచ్చిన నటుడిగా.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఆయన దూసుకుపోతుండటం విశేషం. ఇంకోవైపు పేద ప్రజలకు తోడుగా నిలుస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు. 

#Nandamuri Balakrishna #balakrishna
Advertisment
Advertisment
తాజా కథనాలు