USA: ట్రంప్ తప్పు చేశాడా.. అధికారాన్ని దుర్వినియోగం చేశాడా.. అమెరికా చట్టాలు ఏం చెబుతున్నాయి?

లాస్ ఏంజెలెస్ నిరసనలు ఇప్పుడు కాలిఫోర్నియా ప్రభుత్వం, ట్రంప్ మధ్య గొడవగా మారిపోయింది. నేషనల్ గార్డ్స్ ను తమను అడక్కుండా పంపించారంటూ అక్కడి అటార్నీ జనరల్ రాబ్ బోంటా ఫెడరల్ దావా వేశారు. గార్డ్స్ ను పంపించే ముందు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని ఆరోపించారు.

New Update
usa

California sues Trump over guard deployment

USA: యూఎస్ లో అన్నిటికంటే పెద్ద స్టేట్ అయిన కాలిఫోర్నియా అట్టుడికిపోతోంది. లాస్ ఏంజెలెస్ లో ఆందోళనకారులు మూడు రోజులు అయినా గొడవలు ఆపడం లేదు. మరోవైపు ట్రంప్ చేసే పనులు అక్కడి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. తమతో సంప్రదించకుండా ట్రంప్ చేస్తున్న పనుల వలన మరింత ఉద్రిక్తత పెరిగిపోతోందని కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్(California Governor Newsom) ఆరోపిస్తున్నారు. ప్రజా భద్రత కోసం కాకుండా తన ఈగో దెబ్బతినకుండా ఉండడానికి ఈ చర్యలను తీసుకున్నట్టు ఉందని విమర్శించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం గవర్నర్ న్యూసమ్, మేయర్ కరెన్ బాస్ లపై మండిపడ్డారు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించలేరని విమర్శించారు. ఆందోళనలు అదుపులోకి తీసుకురాలేకపోయారు. అందుకే తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని సమర్ధించుకున్నారు. అక్రమవలసదారులను విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ట్రంప్ ఇచ్చారు. 

Also Read :  తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం

ఈ వివాదం ఎందుకు మొదలైంది?

ట్రంప్ పరిపాలన మొదలైనప్పటి నుండి కాలిఫోర్నియా(California) ఫెడరల్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడింది. పర్యావరణ పరిరక్షణకు కాలిఫోర్నియా ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. అయితే, ట్రంప్ పరిపాలన పర్యావరణ నిబంధనలను సడలించడం, పారిస్ వాతావరణ ఒప్పందం నుండి వైదొలగడం వంటి చర్యలు తీసుకుంది. దీంతో పాటూ అక్రమ వలసలపై ట్రంప్ అనుసరిస్తున్న వాధానాలను గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తోంది. కాలిఫోర్నియా తనను తాను శరణార్థుల రాష్ట్రంగా చెప్పుకుంది. అలాంటి చోట ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెప్పపెట్టకుండా అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు వంద మందిని కూడా అరెస్ట్ చేశారు. దీనికి కాలిఫోర్నియా ప్రభుత్వం గట్టిగా అభ్యంతరం చెప్పింది. తమతో సంప్రదించకుండా ఇలాంటి పనులు చేయడం తగదని సూచించింది. ఈలోపు లాస్ ఏంజెలెస్ లో అల్లర్లు చెలరేగాయి. వాటిని కాలిఫోర్నియా ప్రభుత్వం అదుపు చేసే లోపే మళ్ళీ ట్రంప్ యంత్రాంగం జోక్యం చేసుకుంది. ఆందోళనలు మొదలై కనీసం 24 గంటలు కూడా గడవక ముందే యాక్షన్ తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు. ఎవరికీ చెప్పా పెట్టకుండా 2 వేల మంది నేషనల్ గార్డ్స్ ను డిప్లాయ్ చేశారు. దీంతో లాస్ ఏంజెలెస్ లో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులు వాహనాలు తగలెట్టడం, రోడ్లను బ్లాక్ చేయడం లాంటివి చేస్తున్నారు.  రాష్ట్రాల అనుమతి లేకుండా నేషనల్ గార్డ్‌లను మోహరించడం, ఇది అరుదైన సంఘటన, కాలిఫోర్నియాలో మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. 

Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్

యూఎస్ రాష్ట్రాధికారాలు..

యునైటెడ్ స్టేట్స్‌లో రాష్ట్రాల అధికారాలు ఫెడరల్ వ్యవస్థలో కీలకమైన అంశం. అమెరికా రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం (ఫెడరల్ ప్రభుత్వం) మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజిస్తుంది. ఈ అధికారాల విభజనను "ఫెడరలిజం" అని అంటారు. అక్కడి రాజ్యాంగం పదవ సవరణ ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన విద్య, న్యాయం, వాణిజ్యం ఇలా ఏదైనా రాష్ట్ర అధికారులు గవర్నర్, మేయర్ లాంటి వారే నిర్ణయం తీసుకుంటారు. యూఎస్ లో రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. తమ ప్రాంతంలో జరిగే వాటికి అక్కడి గవర్నర్ ఇతర అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వాళ్ళ రాజ్యాంగంలో క్లియర్ గా ఉంటుంది. ఒకవేళ ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అనుకున్నా ముందుగా రాష్ట్ర ప్రతినిధుల అనుమతి తీసుకోవాలి. 

Also Read: లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్‌ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)

కాలిఫోర్నియా ఎందుకు దావా వేసింది?

కానీ అమెరికా అధ్యక్షుడు లాస్ ఏంజెలెస్ నిరసనల విషయంలో ఇవేమీ పట్టించుకోలేదు. ఎవరికీ చెప్పకుండా తనిఖీలు చేయించారు. తరువాత 2 వేల మంది నేషనల్ గార్డ్స్ పంపించారు. ఈరోజు కూడా 700 మంది మెరైన్ గార్డ్స్ దింపారు. ఈ విషయం కూడా అక్కడి పోలీస్ డిపార్ట్ మెంట్ లేదా ప్రభుత్వానికి చెప్పలేదు. ట్రంప్ ప్రభుత్వ విధానాలు కాలిఫోర్నియా ప్రయోజనాలకు, స్వయంప్రతిపత్తికి ముప్పు వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అసలే ముందు నుంచి కాలిఫోర్నియా ప్రభుత్వం ట్రంప్ మీద గుర్రుగా ఉంది. దానికి తోడు ఇప్పుడు తమను ఏమీ కానట్టు తీసిపారేస్తుంటే మరింత మండింది. అందుకే ట్రంప్ ఫెడరల్ దావా వేశారు.  గవర్నర్ అనుమతి లేకుండా ఒక రాష్ట్ర నేషనల్ గార్డ్‌ను పంపడం ఇదే మొదటిసారి. తమకు కనీసం సమాచారాన్ని కూడా ఇవ్వలేదని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారని గవర్నర్ న్యూసమ్ ఆరోపించారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మెరైన్స్ ను పంపిన విషయం కూడా ఎవరికీ చెప్పలేదు. దీంతో ట్రంప్ మీద ఫెడరల్ దావా వేయనున్నట్టు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ప్రకటించారు. నేషనల్ గార్డ్స్ ను పంపించే ముందు అధ్యక్షుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పారు. ట్రంప్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తమ ఆదేశాన్ని రద్దు చేయాలన్న న్యూసమ్ అభ్యర్థనను విస్మరించారని అన్నారు.

ట్రంప్ పై ఎఫెక్ట్...

కాలిఫోర్నియాతో గొడవ ట్రంప్ పై ఎఫెక్ట్ పడనుందా అంటే అవుననే అంటున్నారు. అక్కడి గవర్నర్ వేసిన దావా విషయంలో అమెరికా అధ్యక్షుడు గెలవరని చెబుతున్నారు. ఎందుకంటే యూఎస్ రూల్స్, రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఎవరైనా రాష్ట్రాల అధికారాలను, చట్టాలను తన చేతుల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. యూఎస్ లో ఏ న్యాయస్థానం కూడా దీన్ని ఒప్పుకోదు. కాబట్టి ఈ దావా విషయంలో కాలిఫోర్నియా ప్రభుత్వమే గెలుస్తుందని అంటున్నారు. దీంతో పాటూ ఎలాన్ మస్క్ తో గొడవ, అక్రమ వలసలు, సుంకాలతో చేస్తున్న రచ్చ ఇవన్నీ ట్రంప్ మీద బాగానే ఎఫెక్స్ చూపిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ప్రజల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. ఇప్పటికే ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు, స్టూడెంట్స్ అందరూ ట్రంప్ కు వ్యతిరేకంగా మారిపోయారు. అక్రమ వలసల అణిచివేతతో మరికొందరు విసిగిపోయారు. ఇదిలాగే కొనసాగితే ఆయన టర్మ్ అవ్వకుండానే కుర్చీ దిగిపోవాల్సి ఉంటుందని అంటున్నారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు