/rtv/media/media_files/2025/06/10/KcCUMSuAsMfJh4RW9mdi.jpg)
New IOS 26
Apple iOS 26: యాపిల్ సరికొత్తగా ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఉన్న ఐవోఎస్ 7 తో ఉన్న ఫ్లాట్ డిజైన్ ట్రెండ్ కు ముగింపు పలుకుతూ కొత్త ఐవోఎస్ ను లాంచ్ చేస్తోంది. ఆపిల్ సంస్థ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ iOS 26ను లాంచ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో ఈ కొత్త అప్డేట్ను అధికారికంగా విడుదల చేసింది. దాదాపు పదేళ్ళ తర్వాత యాపిల్ తన మొబైల్ సిస్టమ్ లో పెద్ద మార్పును చేస్తోంది.
IOS26లో కొత్తగా లిక్విడ్ గ్లాస్ డిజైన్ ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇది గాజులా ఉండి పారదర్శకత, లోతైన షేడింగ్, అలాగే మృదువైన అనుభూతిని కలిగించేలా ఉంటుంది. రెటీనా డిస్ప్లేల్లో A6 సిలికాన్ తో అద్భుతమైన టెక్నాలజీ కలిగి ఉంటుందని యాపిల్ సంస్థ తెలిపింది. ఈ కొత్త డిజైన్, ఆపిల్ విజన్ ప్రో వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌తో గతంలో ప్రవేశపెట్టబడిన కంపెనీ విజన్ఓఎస్ నుండి స్పష్టంగా ప్రేరణ పొందిందని చెప్పారు. యూజర్ ఇంటర్ఫేస్లో ప్రతి మూలకానికి ఓ అద్భుత స్పందన ఉంటుందని కంపెనీ చెబుతోంది. యాప్‌లు, సిస్టమ్ సెట్టింగ్స్, మెనూలన్నీ ఈ డిజైన్‌లో చక్కగా పనిచేయనున్నాయి. యాపిల్ ప్రోడెక్ట్ కు సంబంధించి లాప్ ట్యాప్, ఐపాడ్, ఐఫోన్, వాచ్ అన్నింటిలో దీనిని తీసుకురానున్నారు. Apple Vision Proలో కనిపించే visionOS డిజైన్ శైలికి ఇది చాలా దగ్గరగా ఉండనుంది.
కొత్త ఫీచర్లు..
దాదాపు అన్ని అప్లికేషన్స్ లోనూ ఈసారి పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి.ఫోన్ లో కాల్ స్క్రీనింగ్, హోల్డ్ అసిస్ట్ ఫీచర్లతో కొత్త లేఅవుట్ రానుంది. మెసేజ్ యాప్ లో థీమ్/బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్, గ్రూప్ చాట్స్‌లో పోల్స్, టైపింగ్ ఇండికేటర్స్ కొత్తగా రానున్నాయి. యాసిల్ ఫేస్ టైమ్ కు సంబంధించి ఆపిల్ ఇంటలిజెన్స్ ఆధారిత లైవ్ ట్రాన్సలేషన్ ఫీచర్ ను తీసుకురానున్నారు. అలాగే UIతో కెమెరాకు కొత్త డిజైన్..ఫోటో యాప్ లో మెరుగైన ట్యాబ్స్, బ్రౌజింగ్ ఫీచర్స్ ను తీసుకురానున్నారు. సఫారీలో ఎడ్జ్-టు-ఎడ్జ్ వ్యూవ్ తో మరింత ఇంటరాక్టివ్ వెబ్ బ్రౌజింగ్ ను కూడా తీసుకురానున్నారు. అంతేకాదు యాపిల్ గేమ్స్ అనే కొత్త యాప్ ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జూన్ 10న బీటా వెర్షన్ విడుదల చేస్తారు. జూలై తర్వాత నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది.
Also Read: California: నేషనల్ గార్డ్ విషయంలో ట్రంప్ పై దావా వేసిన కాలిఫోర్నియా ప్రభుత్వం