/rtv/media/media_files/2025/06/06/hnHfBMAL4bqJKQqjpizN.jpg)
Telangana Rain update Photograph: (Telangana Rain update)
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నల్గొండ, మెదక్, వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Also Read: సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
Rain Alert To Telangana
అలాగే బుధవారం వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక గురువారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో సహా వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
Also Read : స్టేజ్ పైనే జారిపోయిన సింగర్ ప్యాంట్.. కానీ, భలే కవర్ చేసింది! వీడియో వైరల్
Heavy rains in North #Telangana
— Warangal Weatherman (@tharun25_t) June 10, 2025
It's again second day for best super thunder storm rains for North West TG places see heavy rains with crops damage also 🥲
Adilabad, Asifabad Nirmal, jagtial
Nizamabad Kamareddy got widespread exllent overnight ⛈️ pic.twitter.com/nOl60IQIkQ
Also Read: ప్రధాని మోదీకి మల్లిఖార్జున్ ఖర్గే సంచలన లేఖ.. ఎందుకంటే..?
Also Read : అవమానించారని హత్య చేశాడు.. బురఖా వేసుకొచ్చి మరి లేపేశాడు!