California: నేషనల్ గార్డ్ విషయంలో ట్రంప్ పై దావా వేసిన కాలిఫోర్నియా ప్రభుత్వం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కాలిఫోర్నియా ప్రభుత్వం ఫెడరల్ దావా వేసింది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ప్రకటించారు. నేషనల్ గార్డ్స్ ను పంపించే ముందు అధ్యక్షుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పారు.

New Update
la

Cafornia government sued president trump on national guards issue

 లాస్ ఏంజెలెస్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను కాలిఫోర్నియా అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్ నేషనల్ గార్డ్‌లను పంపడాన్ని వ్యతిరేకించారు. గవర్నర్ అనుమతి లేకుండా ఒక రాష్ట్ర నేషనల్ గార్డ్‌ను పంపడం ఇదే మొదటిసారి. తమకు కనీసం సమాచారాన్ని కూడా ఇవ్వలేదని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారని గవర్నర్ న్యూసమ్ ఆరోపించారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మెరైన్స్ ను పంపిన విషయం కూడా ఎవరికీ చెప్పలేదు. దీంతో ట్రంప్ మీద ఫెడరల్ దావా వేయనున్నట్టు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ప్రకటించారు. నేషనల్ గార్డ్స్ ను పంపించే ముందు అధ్యక్షుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పారు. ట్రంప్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తమ ఆదేశాన్ని రద్దు చేయాలన్న న్యూసమ్ అభ్యర్థనను విస్మరించారని అన్నారు. ఈ దావా విషయంలో తామే గెలుస్తామని బోంటా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

బాధ్యతలు నిర్వర్తించడం లేదని ఆరోపణ..

ట్రంప్ చర్యలను కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ మొదటి నుంచీ ఖండిస్తూనే వస్తున్నారు.  ట్రంప్ ఈ నిర్ణయం మరింత ఉద్రిక్తతలను పెంచుతుందని ఆయన అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతుందని ఎక్స్ లో రాశారు. తాము లాస్ ఏంజెలెస్ కౌంటీతో చర్చలు జరుపుతున్నామని...అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం గవర్నర్ న్యూసమ్, మేయర్ కరెన్ బాస్ లపై మండిపడ్డారు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించలేరని విమర్శించారు. అక్రమవలసదారులను విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ట్రంప్ ఇచ్చారు. యూఎస్‌ చట్టాలకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మరోవైపు లాస్‌ ఏంజెలెస్‌ ఘటనను వైట్‌హౌస్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్టీఫెన్‌ మిల్లర్‌ తీవ్రంగా ఖండించారు. ఇవి యూఎస్‌ చట్టాలకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు