RCB SALE : అమ్మకానికి ఆర్సీబీ..  షాక్‌లో అభిమానులు!

ఆర్‌సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ యాజమాన్యం డయాజియో ఫ్రాంచైజీని విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోందట. ఆర్‌సీబీ జట్టును పూర్తిగా లేదా కొంత భాగాన్ని విక్రయించేందుకు డయాజియో ప్రయత్నిస్తుంది.

New Update
rcb-sale

ఇటీవల బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయిన విషాదకరమైన సంఘటన తర్వాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యజమాన్యం సంచలన  నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫ్రాంచైజీలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని విక్రయించాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం.  ఆర్సీబీని మొదట విజయ్ మాల్యా సొంతం చేసుకున్నారు.  వేర్వేరు కారణాల వల్ల మాల్యా తన స్పిరిట్స్ వ్యాపారాన్ని డియాజియోకు విక్రయించారు.  డియాజియో 1997లో స్థాపించబడిన బ్రిటిష్ కంపెనీ. ఈ బ్రాండ్ ఆల్కహాలిక్, నాన్‌ ఆల్కహాలిక్‌ పానీయాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ కావడం విశేషం.   

Also Read :  కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మరోసారి కులగణన

Also Read :  అవమానించారని హత్య చేశాడు.. బురఖా వేసుకొచ్చి మరి లేపేశాడు!

ఆర్సీబీ విలువ 2 బిలియన్ డాలర్లు

ఆర్సీబీ విలువ 2 బిలియన్ డాలర్లు (రూ.16వేల కోట్లు) ఉంటుందని బ్లూమ్ బెర్గ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ బ్రిటిష్ డిస్టిలర్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ అయిన డియాజియో పీఎల్సీ వద్ద కొనసాగుతోంది. ఫ్రాంచైజీ యొక్క పెరుగుతున్న విలువను ఉపయోగించుకుని ఎక్కువ భాగం కాకపోయినా, కొన్ని వాటాలైనా అమ్మేయాలని యునైటెడ్ స్పిరిట్స్ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. తద్వారా యునైటెడ్ స్పిరిట్స్‌ భారీగా లబ్ది పొందే అవశామున్నట్లు సమాచారం. 

ఆర్సీబీ అమ్మాకానికి మరో కారణం కూడా తెలుస్తోంది.  గత కొన్ని సీజన్ల నుండి బీసీసీఐ పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ కంటెంట్ ప్రకటనలపై అనేక ఆంక్షలు విధించింది. దీని వల్ల యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తుల యొక్క ప్రచారం కష్టతరం అవుతుంది. ఇది తమ కంపెనీ వృద్ధికి ఆటంకం కలిగిస్తుందని యునైటెడ్ స్పిరిట్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత వారం అహ్మదాబాద్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్‌సిబి చరిత్రలో తొలిసారి ఐపిఎల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.

Also Read :  30 ఏళ్లకే 10 పెళ్లిళ్లు.. అడ్డంగా బుక్కైన నిత్య పెళ్లికూతురు!

Also Read :  హరీష్ రావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్!

Royal Challengers Bangalore | Bengaluru Stampede | RCB SALE | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
తాజా కథనాలు