Stock Markets: లాభాల్లో స్టాక్ మార్కెట్లు..100 పాయింట్లతో సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా దేశీ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 50 పెరిగాయి. ఐటీ, ఇంధన స్టాక్స్ బాగా బూమ్ లో ఉన్నాయి. 

New Update
Stock Market,

Stock Market

Stock Market: ఈరోజు దేశీ మార్కెట్లు బాగానే నడుస్తున్నాయి. ప్రారంభ సమయంలో ఫ్లాట్ గా మొదలైనా..తర్వాత నెమ్మదిగా లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్(Sensex) దాదాపు 100 పాయింట్ల లాభంతో 82,500 స్థాయిలో ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ(Nifty)లో దాదాపు 50 పాయింట్ల పెరుగుదల ఉంది. ఇది 25,135 స్థాయిలో ట్రేడవుతోంది. ఈరోజు ఐటీ, ఇంధన స్టాక్స్ బాగా లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీల్లో టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్టీపీసీ, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ఉండగా..ఎటర్నల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్యూఎల్ మాత్రం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 

Also Read : Bengaluru: రిలేషన్ షిప్‌ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..

ఫ్లాట్ గా అమెరికా మార్కెట్లు..

అమెరికా మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. జూన్ 9న అమెరికా డౌ జోన్స్ 42,761 వద్ద స్థిరంగా ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.31%, ఎస్&పి 0.092% లాభపడ్డాయి. ఇక ఆసియా మార్కెట్లు విషయానికి వస్తే జపాన్ నిక్కీ 0.98% పెరుగుదలతో 38,455 వద్ద, కొరియా కోస్పి 0.76% పెరుగుదలతో 2,877 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.27% పెరిగి 24,246 వద్ద ఉండగా, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.11% పెరిగి 3,403 వద్ద ముగిసింది. 

Also Read: లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్‌ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)

నిన్న దేశీ స్టాక్ మార్కెట్లలో బూమ్ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 256 పాయింట్ల లాభంతో 82,445 ఉండగా..నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 25,103 వద్ద ఉంది. 

Also Read: Apple: లిక్విడ్ గ్లాస్ డిజైన్ తో యాపిల్ ప్రోడెక్ట్స్..IOS 26 లాంచ్

Advertisment
తాజా కథనాలు