/rtv/media/media_files/2025/06/10/DiJGpX0P8WFhxKPTyxFk.jpg)
Meghalaya Honeymoon couple marriage
Honeymoon Murder Case: ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ వివాహం అయిన కొద్ది రోజులకే తన భార్య సోనమ్‌తో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మెయిన్ విలన్ రాజా భార్య సోనమ్ కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి ఉండాలని.. తన భర్తను హత్య చేయించింది. నలుగురు కిల్లర్లకు సుపారీ ఇచ్చి మరీ తన భర్త రఘువంశీని హత్య చేయించింది. ఈ కేసులో పోలీసులు ఆమెతో పాటు మరో ముగ్గురుని అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Man, just look at his face — so full of hope, happy with the marriage, while the bride clearly didn’t feel the same. Why is it so hard to just say no instead of ruining a life later? Justice must be served for Raja. 💔#SonamRaghuvanshi | #IndoreCouple | #rajaraghuvanshi pic.twitter.com/vUMNuqYnzC
— Indian Army 🪖 (@JiteshU34365044) June 10, 2025
Also Read : తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
పెళ్లి వీడియో
ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో రాజా రఘువంశీ - సోనమ్ జంటకు సంబంధించిన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పెళ్లి వీడియోలో రాజా రఘువంశీ చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అదే సమయంలో పెళ్లి కూతురిగా ఉన్న సోనమ్ ముఖంలో ఎలాంటి ఆనందం కనిపించడం లేదు.
Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్
పురోహితులు పెళ్లి తంతు జరిపిస్తుండగా.. రాజా రఘువంశీ హ్యీపీగా ఉండటం చూడవచ్చు. కానీ సోనమ్ మాత్రం తల పైకి ఎత్తకుండా.. ముఖంలో చిన్న చిరునవ్వు లేకుండా కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లికి నో చెప్పడం కంటే ఎవరినైనా హత్య చేయడం సులభమా? అని కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు.
HONEYMOON HORROR!
— अमर सिंह (@ASingh0404) June 9, 2025
She wore sindoor.👰🏻
He wore hope.🕊️
She carried betrayal.🩸
She vowed to walk with him for 7 lifetimes,But 13 days into marriage, she allegedly hired a killer.
Raja Raghuvanshi didn’t come back from his honeymoon, only his body did.#SonamRaghuvanshi pic.twitter.com/7QIBVv6eom
Also Read: లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)
మూడు రోజుల రిమాండ్
హనీమూన్‌లో భర్త హత్య కేసులో సోనమ్‌కు కోర్టు రిమాండ్ విధించింది. సోనమ్‌కి ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చిన తర్వాత.. ఆమెను షిల్లాంగ్‌కు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె బీహార్‌లో ఉంది. ఇక్కడి నుండి ఆమె విమానంలో మరింత దూరం ప్రయాణిస్తుంది. షిల్లాంగ్‌లోని మేఘాలయ పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడి నుండి ఆమెను రిమాండ్‌కు తరలిస్తారు.