USA: భారతీయ విద్యార్థిపై అమెరికా అధికారుల కర్కశం.. వీడియో వైరల్

అమెరికాలో బహిష్కరణకు గురైన వారిపట్ల అక్కడి అధికారులు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ భారతీయ విద్యార్థిని బహిష్కరించే సమయంలో అతడిని అమెరికా అధికారులు వ్యవహరించిన తీరు కలకలం రేపుతోంది.

New Update
Indian Man Handcuffed, Pinned To Floor At US Airport

Indian Man Handcuffed, Pinned To Floor At US Airport

అమెరికాలో అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బహిష్కరణకు గురైన వారిపట్ల అక్కడి అధికారులు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇటీవల భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను సంకెళ్లు వేసి ప్రత్యేక విమానాల్లో ఎలా పంపించారో తెలిసిందే. తాజాగా ఓ భారతీయ విద్యార్థిని బహిష్కరించే సమయంలో అతడిని అమెరికా అధికారులు వ్యవహరించిన తీరు కలకలం రేపుతోంది. 

Also Read: లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్‌ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)

Video Claims To Show Indian Man Handcuffed

అతడి చేతులకు సంకెళ్లు వేసి, నేలపై పడుకోబెట్టి దేశం నుంచి బహిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కునాల్‌ జైన్ అనే NRI ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. గత కొన్నిరోజులుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల అమెరికాలోని భారతీయ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. 

Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్

ఆ విద్యార్థిని అధికారులు ఒక నేరస్తుడిలా చూశారని.. చేతుల సంకెళ్లు వేసి నేలకోసి కొట్టారంటూ ధ్వజమెత్తారు. ఆ విద్యార్థి హర్యానా భాషలో మాట్లాడుతున్నట్లు చెప్పారు.  ఆ విద్యార్థి నేను వెర్రివాన్ని కాదని.. ఇక్కడి వారు తనను వెర్రివాడిలా చూపించేందుకు యత్నిస్తున్నారని చెప్పడాని అన్నారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు చాలావరకు నమోదయ్యాయని పేర్కొన్నారు.

Also Read :  తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం

Also Read :  మునగ నీటితో అద్భుత లాభాలు.. డయాబెటిక్ రోగులకు బెస్ట్‌ కషాయం..!!

telugu-news | usa | rtv-news | Immigrants | america illegal immigrants news

Advertisment
Advertisment
తాజా కథనాలు