🔴Live News Updates: భీకర దాడి.. ఇజ్రాయెల్‌ను చావుదెబ్బకొట్టిన ఇరాన్..

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Train Fire Accident: తిరుపతి-సికింద్రాబాద్‌ ట్రైన్‌లో మంటలు

APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ వెళ్లే సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్‌ బైండింగ్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. లోకో పైలట్ గమనించి వాటిని ఆర్పేశారు. 

Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out
Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out

APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలపై ఉన్న ట్రైన్‌లో మంటలు వ్యాపించాయి. తిరుపతి-సికింద్రాబాద్‌ వెళ్లే సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్‌ బైండింగ్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. భయంతో బిక్కుబిక్కుమంటూ గజగజ వణికిపోయారు. 

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

వెంటనే భయంతో గట్టిగా కేకలు వేశారు. దీంతో వెనుక ఉన్న గార్డు గమనించి లోకో పైలట్ను అప్రమత్తం చేశారు. వెంటనే లోకో పైలట్ ట్రైన్‌ను నిలిపివేశారు. అనంతరం వెనుక బోగీ చక్రాల వద్ద రేగిన మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల రైల్వేస్టేషన్‌ సమీపంలో సోమవారం రాత్రి 8.55 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీని కారణంగా ట్రైన్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. అనంతరం సికింద్రాబాద్‌కు బయలుదేరింది. ఈ ఘటనతో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

  • Jun 17, 2025 19:02 IST

    చైనాలో భారీ పేలుడు..9 మంది దుర్మరణం..26 మంది తీవ్రంగా..

    చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని లిన్ లీ కౌంటీలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. రిమోట్ కంట్రోల్డ్ వాటర్ ఫిరంగుల సాయంతో 20 గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.

    China crime news
    China crime news

     



  • Jun 17, 2025 18:29 IST

    భీకర దాడి.. ఇజ్రాయెల్‌ను చావుదెబ్బకొట్టిన ఇరాన్..

    తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ విరుచుకుపడింది. టెల్‌ అవీవ్‌లోని మొస్సాద్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై దాడులకు దిగింది. దీంతో 90 ఇజ్రాయెల్‌ కీలక డేటా ధ్వంసం అయ్యింది.

    Iran's IRGC claims strikes at Israeli army centre, Mossad operations hub
    Iran's IRGC claims strikes at Israeli army centre, Mossad operations hub

     



  • Jun 17, 2025 18:01 IST

    కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

    కర్ణాటకలోని ఓల్డ్ హుబ్బళీ టౌన్‌లో అనుష హులిమర అనే మహిళ తన కుమారుడి అల్లరి తట్టుకోలేక.. అతని ప్రవర్తనపై తీవ్ర కోపంతో చేతులు, కాళ్లు, మెడపై ఇనుప కడ్డీని కాల్చి వాతలు పెట్టింది. చుట్టుపక్కల వారు బాలుడి రక్షించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

    stabbed son with iron rod
    stabbed son with iron rod

     



  • Jun 17, 2025 18:00 IST

    TCS సంచలన నిర్ణయం.. బెంచ్‌పై ఇక 35 రోజులే

    ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి ఉద్యోగి ఏటా 225 బిల్ల్‌డ్‌ బిజినెస్‌ రోజులు పనిచేసి ఉండాలనే రూల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం బెంచ్‌ మీద ఉద్యోగులు కేవలం 35 రోజులు మాత్రమే ఉంటారు.

    TCS New Bench Policy, new rule limits the bench period to 35 days per year
    TCS New Bench Policy, new rule limits the bench period to 35 days per year

     



  • Jun 17, 2025 17:30 IST

    సత్తెనపల్లిలో హైటెన్షన్.. జగన్ పర్యటన ఉంటుందా? ఉండదా?

    రేపు జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల పొదిలి ఘటన నేపథ్యంలో జగన్ టూర్ కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే.. పర్యటన చేసి తీరుతామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తుండడంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది.

    AP Palnadu Police
    AP Palnadu Police

     



  • Jun 17, 2025 17:11 IST

    కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు

    కన్నప్ప మూవీపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సెన్సార్ స్క్రూటినీ జరగక ముందే విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఈ సినిమా సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే విధంగా నిర్మించబడిందని రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

    ap high court
    ap high court

     



  • Jun 17, 2025 17:10 IST

    48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

    గత 48 గంటల్లో మొత్తం 9 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిలో కొన్ని ప్రయాణాన్ని రద్దు చేయగా.. మరికొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యాయి.

    Air India Flight
    Air India Flight

     



  • Jun 17, 2025 16:43 IST

    హైదరాబాద్‌లో విచిత్రమైన ఏటీఎం చోరీయత్నం.. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా..!!

    చందానగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో ఓ దొంగ చోరీకి యత్నించాడు. తలకిందులయ్యేలా శ్రమించినా.. మిషన్ ఓపెన్ కాలేదు. దీంతో శరీరం అలసిపోనట్లు అక్కడే నేలపై పడుకొని నిద్రపోయాడు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో నమోదవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

    ATM theft
    ATM theft

     



  • Jun 17, 2025 16:06 IST

    ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన చైనా

    ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్‌కు చైనా భారీగా మిలటరీ సాయం చేస్తోంది. ఇప్పటికే రెండు కార్గో విమానాల్లో మిలటరీ సామాగ్రీని తరలించింది.

    china Supplies weapons to iran during present conflict
    china Supplies weapons to iran during present conflict

     



  • Jun 17, 2025 16:06 IST

    ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ సంచలన ఆరోపణలు!

    ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ వేదిస్తోందని కానిస్టేబుల్ మదన్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఏకంగా డీజీపీకి లేఖ రాశారు. గతంలో ఈ కానిస్టేబుల్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి గన్ మెన్ గా ఉన్నారు.

    AP Liquor Scam Chevireddy Bhaskar Reddy
    AP Liquor Scam Chevireddy Bhaskar Reddy

     



  • Jun 17, 2025 15:29 IST

    ఖమేనీని లేపేస్తేనే యుద్ధం ముగిస్తోంది.. నెతన్యాహు సంచలన ప్రకటన

    ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీని అంతం చేస్తేనే ఇరుదేశాల మధ్య యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు.

    On Trump's No To Killing Iran's Supreme Leader, A Big Remark By Netanyahu
    On Trump's No To Killing Iran's Supreme Leader, A Big Remark By Netanyahu

     



  • Jun 17, 2025 15:00 IST

    ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఎవరు ? భారత్‌తో వివాదం ఏంటీ ?

    ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.

    Ayatollah Ali Khamenei
    Ayatollah Ali Khamenei

     



  • Jun 17, 2025 13:57 IST

    Israel Iran Conflict : ఇరాన్‌ను వేసేయండి...జీ7 దేశాల సంయుక్త ప్రకటన

    ఇరాన్‌ ఇజ్రాయెల్‌యుద్ధం ముదురుతోంది. రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల సమ్మిట్‌లో ఆయా దేశాలు ఇజ్రాయెల్‌కు మద్ధతుగా నిలిచాయి.

    iran
    Iran-Israel war

     



  • Jun 17, 2025 13:57 IST

    Kaleshwaram Commission: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్?

    కాళేశ్వరం ప్రాజెక్ట్‌  నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ ను గతంలోనే కోరినప్పటికి ఇంతవరకు ఇవ్వకపోవడంపై కమిషన్‌ సీరియస్‌ అయింది.

    Kaleshwaram commission
    Kaleshwaram commission

     



  • Jun 17, 2025 13:55 IST

    Israel Iran Conflict: పశ్చిమాసియాలో ఎయిర్‌పోర్టులు క్లోజ్‌... భయాందోళనలో వేలాదిమంది

    ఇజ్రాయెల్‌ ఇరాన్‌ యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పలు దేశాలు తమ గగనతలాలపై ఆంక్షలు విధించాయి. ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో తన గగన తలాన్ని పూర్తిగా మూసివేసింది.

    Bomb Threat To Lufthansa Airlines Flight Lh 752
    Bomb Threat To Lufthansa Airlines Flight Lh 752

     



  • Jun 17, 2025 13:52 IST

    Israel Iran conflict : తారాస్థాయికి చేరిన యుద్ధం.. ఇరాన్‌ అణు స్థావరం ధ్వంసం

    ఇరాన్‌, ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్‌ అణుస్థావరంపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. నటాంజ్‌లోని అణు స్థావరంపై క్షిపణుల దాడి చేసింది. ఈ దాడిలో సెంట్రిఫ్యూజ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తొమ్మిది మంది ఇరానియన్ అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు.

    Centrifuges at Iran's Natanz site likely destroyed



  • Jun 17, 2025 13:51 IST

    Israel Iran Conflict: దాడులు భవనాలను కదిలించగలవు, కానీ అవి సత్యాన్ని కదిలించలేవు....ఇజ్రాయెల్‌కు ఇరానియన్‌ యాంకర్‌ సహర్‌ సవాల్‌

    ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ రాష్ట్ర మీడియా సంస్థ IRIB (ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్) పై ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కనిపించిన యాంకర్ సహర్ ఎమామి ఇప్పుడు ఇరాన్‌లో ప్రతిఘటనకు చిహ్నంగా మారారు.

    Iranian anchor Sahar



  • Jun 17, 2025 12:58 IST

    Bird Strike Tests: బతికున్న కోళ్లతో విమానానికి పరీక్షలు.. ఎలా చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు!

    విమానాలు టేకాఫ్ అయ్యే ముందు విమానం పూర్తి సామర్థ్యం బలాన్ని పరీక్షిస్తారు. పక్షి ఢీకొంటే ఎలాంటి ప్రమాదం జరుగుతుందా? అనేది తెలుసుకోవడం కోసం బతికున్న కోళ్లను ఇంజిన్‌లోకి పడేస్తారు. దీని కారణంగా ఎలాంటి నష్టం జరుగుతుందో ముందుగానే తెలుసుకుంటారు.

    Bird Strike Tests
    Bird Strike Tests

     



  • Jun 17, 2025 12:58 IST

    Mandi Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. ఇద్దరు స్పాట్‌డెడ్- మరో 25 మంది! (వీడియో)

    హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    himachal pradesh mandi bus accident 2 died
    himachal pradesh mandi bus accident 2 died

     



  • Jun 17, 2025 10:55 IST

    Talliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ మరో ఛాన్స్.. డబ్బులు రాలేదా? ఇలా చేయండి

    ‘తల్లికి వందనం’ డబ్బులు రానివారికి ప్రభుత్వం మరోఛాన్స్ కల్పించింది. ఈనెల 20 వరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నారు. జూన్ 28లోపు అందిన ఫిర్యాదులను వెరిఫై చేసి.. జూన్ 30న అర్హుల కొత్త జాబితాను ప్రదర్శిస్తారు. జులై 5న డబ్బులు వేస్తారు.

    thalliki vandanam scheme money
    thalliki vandanam scheme money

     



  • Jun 17, 2025 10:12 IST

    AP DSC Exam 2025: ఏపీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లు రిలీజ్.. ఈ లింక్‌తో చెక్ చేసుకోవచ్చు

    ఇప్పటికే జరిగిన ఏపీ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను ఇవాళ విద్యాశాఖ విడుదల చేయనుంది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించనుంది. https://apdsc.apcfss.in/ ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

    ap dsc exams 2025  preliminary key released today
    ap dsc exams 2025 preliminary key released today

     



  • Jun 17, 2025 10:11 IST

    Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. మెడికోల కుటుంబాలకు వైద్యుడి రూ.6కోట్ల సాయం

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన మెడికోల కుటుంబాలకు సాయం చేసేందుకు ఓ వైద్యుడు ముందుకొచ్చారు. యూఏఈలో నివాసముంటున్న భారత వైద్యుడు డా.షంషీర్ వయాలిల్ మెడికోల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.6కోట్ల నగదు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

    UAE-based Indian doctor donates Rs. 6 crore to  medics families
    UAE-based Indian doctor donates Rs. 6 crore to medics families

     



  • Jun 17, 2025 10:11 IST

    ICC Womens ODI World Cup 2025 Schedule: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ Vs పాక్ మ్యాచ్.. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 పూర్తి షెడ్యూల్

    మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారతదేశం, శ్రీలంక వేదికలలో మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ తొలిసారిగా తలపడనున్నాయి. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి

    ICC Womens ODI World Cup 2025
    ICC Womens ODI World Cup 2025

     



  • Jun 17, 2025 07:51 IST

    Snake Video: పాముతో ఆటలు.. ముద్దుపెట్టబోయి మృత్యువు అంచుల్లో రైతు! (వీడియో)

    పాముకు ముద్దు పెట్టబోయిన ఓ రైతు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జితేంద్ర కుమార్‌ రీల్స్ కోసం పాముకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. అది నాలుకపై కాటు వేయడంతో పరిస్థితి విషమించింది. ఇప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉంది.

    UP man tries to kiss snake for reel, gets bitten
    UP man tries to kiss snake for reel, gets bitten

     



  • Jun 17, 2025 07:50 IST

    Train Fire Accident: తిరుపతి-సికింద్రాబాద్‌ ట్రైన్‌లో మంటలు

    APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ వెళ్లే సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్‌ బైండింగ్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. లోకో పైలట్ గమనించి వాటిని ఆర్పేశారు. 

    Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out
    Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out

     



  • Jun 17, 2025 07:15 IST

    Telangana Crime: తెలంగాణలో ఘోరం.. తండ్రిని రోకలిదుడ్డుతో కొట్టికొట్టి చంపిన కూతురు.. తల్లే కారణం..!

    నిజామాబాద్‌ జిల్లాలోని ధర్మారం గ్రామంలో దారుణం జరిగింది. తండ్రి నర్సయ్య (54) చెడు వ్యసనాలకు బానిసై తరచూ తల్లి నర్సమ్మతో గొడవ పడుతున్నాడని కూతురు అతడ్ని కొట్టి చంపింది. ఆపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం వివరించింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

    daughter killed father in nizamabad district
    daughter killed father in nizamabad district

     



Advertisment
Advertisment
తాజా కథనాలు