Fire Accident: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

దుబాయ్‌లోని మెరినా టవర్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్‌ అలారమ్ సిస్టమ్‌ను ఆన్‌ చేసినప్పటికీ అది పనిచేయలేదు. దీంతో పొగలు రావడంతో ఆ భవనంలో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు.

New Update
Major fire at Marina Pinnacle (Tiger Tower) in Dubai

Major fire at Marina Pinnacle (Tiger Tower) in Dubai

దుబాయ్‌లోని మెరినా టవర్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో  ఫైర్‌ అలారమ్ సిస్టమ్‌ను ఆన్‌ చేసినప్పటికీ అది పనిచేయలేదు. దీంతో పొగలు రావడంతో ఆ భవనంలో ఉన్నవారు భయంతో అరుపులు, కేకలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కిందకి పరుగెత్తారు. మెరినా టవర్‌ మొత్తం 67 అంతస్తుల్లో ఉంది. 764 ఫ్లాట్స్‌ ఉన్నాయి. అందులో ఉంటున్న 3,820 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు