/rtv/media/media_files/2025/06/15/ZHSydQZCdOl5n3kYi5MC.jpg)
Iran-Israel war
ఇరాన్ ఇజ్రాయెల్యుద్ధం ముదురుతోంది. రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల సమ్మిట్‌లో ఆయా దేశాలు ఇజ్రాయెల్‌కు మద్ధతుగా నిలిచాయి. దీంతో ఇరాన్ ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన సదస్సులో జీ7 దేశాలు (కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్) ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు స్వీయరక్షణ హక్కు ఉందని మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని జీ 7 దేశాలు కోరాయి. ఈ నెల13 నుంచి కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్‌ను ప్రాంతీయ అస్థిరత ఉగ్రవాదానికి మూలం గా జీ7 దేశాలు అభివర్ణించాయి. ఇరాన్ తన దాడులను విరమించుకోవాలని జీ7 దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ అణ్వాయుధాల్ని కలిగి ఉండటాన్ని జీ-7 దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.
Also Read: ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం.. నెక్స్ట్ పాకిస్థాన్‌పై దాడులు !
యుద్ధ విమానాల ధ్వంసం
కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. టెహ్రాన్‌లోని విమానాశ్రయం లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ దాడుల్లో విమానశ్రయంలో ఉన్న ఎఫ్ 14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి.ఈ దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ షేర్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు ఇరాన్ వీటిని విమానాశ్రయంలో ఏర్పాటు చేసిందని తెలిపింది. ఇరాన్ తమపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంచిన జెట్ విమానాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఈ దాడిలో విమానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం ఆసక్తికరంగా మారింది. ఈ యుద్ధ విమనాలను 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్‌కు ముందు అమెరికా వీటిని ఇరాన్‌కు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ ఇప్పటికీ ఆ యుద్ధ విమానాలను వినియోగిస్తుండటం విశేషం.
Also Read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Also Read: ఫిట్‌గా ఉండాలనుకుంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు.. ప్రతిరోజూ ఇలా చేయండి!
israel-iran | israel iran war | israel iran attack | israel iran war news | israel iran latest news | israel iran crisis | israel iran war today | israel iran conflict