AP DSC Exam 2025: ఏపీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లు రిలీజ్.. ఈ లింక్‌తో చెక్ చేసుకోవచ్చు

ఇప్పటికే జరిగిన ఏపీ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను ఇవాళ విద్యాశాఖ విడుదల చేయనుంది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించనుంది. https://apdsc.apcfss.in/ ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

New Update
ap dsc exams 2025  preliminary key released today

ap dsc exams 2025 preliminary key released today

AP DSC Exam 2025: AP DSC పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జూన్ 30వ తేదీ నాటికి అన్ని ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు ముగియగా.. అందులో కొన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ లను ఈరోజు విద్యాశాఖ రిలీజ్ చేయనుంది. అదే సమయంలో ఇందులో ఏవైనా అభ్యంతరాలు ఉన్నా.. వాటిని కూడా స్వీకరించనుంది. 

Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!

AP DSC Exam 2025

ఇవాళ (జూన్ 17) స్కూల్ అసిస్టెంట్ కన్నడ, తమిళం ఉర్దూ, ఒడియా పరీక్షల ప్రాథమిక కీ రిలీజ్ చేయనున్నారు. అంతేకాకుండా జూన్ 23 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ప్రాథమిక కీ ల కోసం https://apdsc.apcfss.in/ వెబ్ సైట్‌ను క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఏవైనా అభ్యంతరాలు ఉన్నా ఈ వెబ్ సైట్ ద్వారానే పంపించవచ్చు. 

Also read: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!

సోమవారం జరిగిన స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) సోషల్ స్టడీస్ ఎగ్జామ్‌కు మొత్తం 38,243 అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అందులో 36,372 మంది అంటే 95.11 శాతం మంది హాజరయ్యారు. 

Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

కాగా ఏపీ సర్కార్.. గతంలో ఏపీ మెగా డీఎస్సీలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనుంది. ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి మొత్తం 5,77,417 అప్లికేషన్లు వచ్చాయి. పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవడం గమనార్హం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు