/rtv/media/media_files/2025/06/17/6rNaBWkIgELN2viDbhSE.jpg)
On Trump's No To Killing Iran's Supreme Leader, A Big Remark By Netanyahu
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతం చేస్తేనే ఇరుదేశాల మధ్య యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఖమేనీని హత్య చేసేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ వేసింది. అయితే ఈ ప్లాన్‌ను ట్రంప్ వ్యతిరేకించినట్లు అమెరికా అధికారులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే తాజాగా నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also read: బతికున్న కోళ్లతో విమానానికి పరీక్షలు.. ఎలా చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు!
Israel-Iran War
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనిని అంతం చేస్తేనే యుద్ధం ఆగుతుందని నెతన్యాహు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. గత నాలగు రోజులుగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. పలుచోట్ల జనావాసాలపై కూడా దాడులు జరడంతో ఇరు దేశాల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ దేశాల ప్రభుత్వాలు తమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.
Also Read: లోయలో పడిపోయిన బస్సు.. ఇద్దరు స్పాట్‌డెడ్- మరో 25 మంది! (వీడియో)
ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్‌లోని అణు స్థావరాలను ధ్వంసం చేసింది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో ఆయన కుటుంబీకులను ఓ రహస్య బంకర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఆయనకు భద్రత కల్పిస్తోంది. ఖమేనీ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని.. ఇరాన్ రక్షణ చర్యలను ఆయన నిరంతరం పరిశీలిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read : AP Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ సంచలన ఆరోపణలు!
telugu-news | national-news | israel iran war