Bird Strike Tests: బతికున్న కోళ్లతో విమానానికి పరీక్షలు.. ఎలా చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు!

విమానాలు టేకాఫ్ అయ్యే ముందు విమానం పూర్తి సామర్థ్యం బలాన్ని పరీక్షిస్తారు. పక్షి ఢీకొంటే ఎలాంటి ప్రమాదం జరుగుతుందా? అనేది తెలుసుకోవడం కోసం బతికున్న కోళ్లను ఇంజిన్‌లోకి పడేస్తారు. దీని కారణంగా ఎలాంటి నష్టం జరుగుతుందో ముందుగానే తెలుసుకుంటారు.

New Update
Bird Strike Tests

Bird Strike Tests

విమానాలు టేకాఫ్ లేదా ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షులు ఢీకొనడం లాంటి ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో విమానాలు పేలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అందువల్ల విమాన సేఫ్టీపై ఎయిర్ లైన్స్ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాయి. ఒక విమానం టేకాఫ్ అయినపుడు లేదా ల్యాండ్ అయినపుడు భూమికి దగ్గరగా ఉంటుంది. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న పక్షులు విమానంతో ఢీకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో చిన్న పక్షి వందల మంది మరణానికి కారణం అవుతుంది. 

Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!

Bird Strike Tests

కాగా ఒక విమానం గంటలకు 350 కి.మీ వేగంతో ఎగిరినపుడు ఒక చిన్న వస్తువు తగిలినా విమానం పేలిపోయే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఒక పక్షి విమానం ఇంజిన్‌లోకి ప్రవేశిస్తే బ్లేడ్‌లు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మంటలు కూడా వ్యాపించవచ్చు. ఆ సమయంలో ఇంజిన్ స్ట్రక్ అయి ఆగిపోయే ప్రమాదం కలుగుతుంది. దీని కారణంగా విమానం క్షణాల్లో బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 

Also read: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!

అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు టేకాఫ్ అయ్యే ముందు ‘బర్డ్స్ స్ట్రైక్ టెస్ట్’తో విమానం పూర్తి సామర్థ్యం బలాన్ని పరీక్షిస్తాయి. పక్షి ఢీ కొంటే ఎలాంటి ప్రమాదం జరుగుతుందా? అనేది తెలుసుకోవడం కోసం ఓ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికోసం విమానం టేకాఫ్ అయ్యే ముందు బతికున్న కోళ్లను ఇంజిన్‌లోకి పడేస్తారు. అవును మీరు విన్నది నిజమే. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇదే అసలైన నిజం. 

Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఇది ఒక శాస్త్రీయ పద్దతి. విమానం పై పక్షులు ఢీ కొనడం వల్ల కలిగే ప్రభావాలను ముందుగానే తెలుసుకోవడానికి ‘చికెన్ గన్’ అనే ప్రత్యేక యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఇది గాలితో నిండిన పెద్ద ఎయిర్ ఫిరంగి. బతికున్న కోడిని పడేసినపుడు ఎయిర్ గన్ లేదా ఫిరంగి వంటి యంత్రం విమానం రెక్కల్లోకి విసిరేస్తుంది. గాలిలో పక్షులు ఢీకొన్నపుడు ఎక్కడ నష్టం జరుగుతుంది.. ఎలాంటి నష్టం జరుగుతుందో ముందుగానే తెలుసుకుంటారు. విమానం రెక్కలు విరిగిపోయాయా? ఇంజిన్ బ్లేడ్‌లు విరిగిపోయాయా? వింగ్ షీల్డ్ విరిగిపోయిందా? అని తనిఖీ చేస్తారు. పెద్ద నష్టం జరగకపోతే విమానం ఎగరగలదు అని నిర్దారిస్తారు. 

ఈ పరీక్ష సాధారణంగా ల్యాబొరేటరిలో జరుగుతుంది. ల్యాబొరేటరీలో కోడిని ఢీకొన్న తర్వాత ఇంజినీర్లు దానిని హైస్పీడ్ కెమెరాతో రికార్డు చేస్తారు. ఆపై దాని వల్ల కలిగే నష్టాన్ని విశ్లేషిస్తారు. ఈ ఇంజిన్‌ పరీక్షను నిజమైన కోడితో పరీక్షిస్తారు. ఎందుకంటే దాని బరువు, ఆకారం ఆకాశంలో ఎగురుతున్న పక్షుల మాదిరిగానే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇదే పద్దతిని ప్రతి ఎయిర్ లైన్ సంస్థ అవలంభిస్తుంది. 

 

Flight Tests

Advertisment
Advertisment
తాజా కథనాలు