China: చైనాలో భారీ పేలుడు..9 మంది దుర్మరణం..26 మంది తీవ్రంగా..

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని లిన్ లీ కౌంటీలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. రిమోట్ కంట్రోల్డ్ వాటర్ ఫిరంగుల సాయంతో 20 గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.

New Update
China crime news

China crime news

చైనాలో మరోసారి పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని లిన్ లీ కౌంటీలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు పెను దురంతానికి దారితీసింది. ఈ పేలుడులో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో మంటలార్పడం పెద్ద సవాలుగా మారింది. మంటలు చెలరేగిన వెంటనే పెద్దఎత్తున పొగలు  చుట్టేసినట్టు   వీడియోల్లో కనిపిస్తుంది. మంటలు ఎగిసిపడుతూ ఫ్యాక్టరీ పరిసర భవనాలను పూర్తిగా దెబ్బతీశాయి. కొన్నిచోట్ల భవనాలు పూర్తిగా కూలిపోయాయి. ఊహించని విధంగా పేలుడు జరిగిన ఆ క్షణానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు.

Also Read :  కుప్పం మహిళకు సీఎం చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం

టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు..

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ ప్రాంతంలో మరిన్ని బాణసంచా గోదాములు ఉండటంతో తరచూ చిన్నచిన్న పేలుళ్లు సంభవించడం వల్ల సహాయక చర్యలు కూడా ఆపాదించబడినట్లు తెలుస్తోంది. మంటలార్పేందుకు అవసరమైన నీటి వనరులు లేకపోవడం, ప్రమాదం జరిగిన ప్రదేశం కొండ ప్రాంతంలో ఉండటం రక్షణ చర్యల్ని మరింత కష్టతరం చేశాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య రిమోట్ కంట్రోల్డ్ వాటర్ ఫిరంగుల సాయంతో సుమారు 20 గంటల పాటు నిర్వహించిన ప్రయత్నాల తరువాత మంటలను అదుపులోకి తెచ్చారు.

Also Read :  AIతో క్యాన్సర్ టెస్ట్.. కేవలం రూ.3 వేలకే.. ఎలా పని చేస్తుందంటే?


చైనాలో ఇటువంటి పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉండటం వల్ల ఈ తరహా ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. మే నెలలో తూర్పు చైనా షాన్డాంగ్ ప్రావిన్స్‌లో జరిగిన కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే తరహాలో 2015లో టియాంజిన్ ఓడరేవు నగరంలో జరిగిన భారీ పేలుడులో 170 మందికి పైగా మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అస్పష్టమైన నిబంధనలు, నిర్లక్ష్యంగా నిర్వహించబడుతున్న పరిశ్రమలు చైనాలో ఇటువంటి విషాదకర ఘటనలకి కారణంగా నిలుస్తున్నాయని కొందరూ విమర్శలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

ఇది కూడా చదవండి: ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగితే అనేక వ్యాధులకు చెక్

(china | crime news | telugu-news | Latest News | crime)


Advertisment
తాజా కథనాలు