ATM: హైదరాబాద్‌లో విచిత్రమైన ఏటీఎం చోరీయత్నం.. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా..!!

చందానగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో ఓ దొంగ చోరీకి యత్నించాడు. తలకిందులయ్యేలా శ్రమించినా.. మిషన్ ఓపెన్ కాలేదు. దీంతో శరీరం అలసిపోనట్లు అక్కడే నేలపై పడుకొని నిద్రపోయాడు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో నమోదవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

New Update
ATM theft

ATM theft

జీవితంలో కొన్ని సంఘటనలు వినగానే నవ్వు రావాల్సిందే. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఓ విచిత్ర ఘటన అలాంటిదే. చందానగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన నేర పూరితంగా కాక, హాస్య పూరితంగా మారింది. ఒక అజ్ఞాత వ్యక్తి దొంగతనం లక్ష్యంగా నల్ల గండ్ల శుభం హోటల్ సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం సెంటర్‌లోకి చొరబడాడు. తన వెంట తీసుకొచ్చిన పదునైన ఆయుధాలతో ఏటీఎంను ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. తలకిందులయ్యేలా శ్రమించినా.. మిషన్ ఓపెన్ చేయడంలో విఫలమయ్యాడు. ఎంత కష్టపడినా ఫలితం దక్కక.. శరీరం అలసిపోయిందో ఏమో కానీ చివరికి అక్కడే నేలపై పడుకొని నిద్రపోయాడు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో నమోదవడంతో.. ముంబైలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి అలర్ట్ వెళ్లింది.

Also Read :  కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు

చోరీకి వచ్చి హాయిగా నిద్రపోయాడు..

సందేశం అందుకున్న వెంటనే బ్యాంకు సిబ్బంది చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు ఏటీఎం సెంటర్‌కు హుటాహుటిన చేరుకొని తలుపులు తెరిచి చూడగా అక్కడ ఒక్కరే హాయిగా నిద్రపోతున్నాడు. ఆ దృశ్యం చూసి వారే ఓ సారి కంగారుపడి.. తర్వాత నవ్వుకోక తప్పలేదు. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా? అంటూ లేపారు. పోలీసులు వస్తే షాక్‌కు గురైన దొంగ బిక్కమొహం వేసుకొని అక్కడికక్కడే బద్దకంగా నిల్చుండిపోయాడు.

ఇది కూడా చదవండి: ఫిట్‌గా ఉండాలనుకుంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు.. ప్రతిరోజూ ఇలా చేయండి!

అతడి పరిస్థితిని పరిశీలించిన పోలీసులు.. అతడు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. అయితే అతడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? దొంగతనమే ఉద్దేశ్యమా లేక మత్తులో తప్పిపోయాడా? అనే విషయాలపై విచారణ కొనసాగుతోంది. కానీ ఈ సంఘటన మాత్రం పోలీసులకు సీరియస్‌గా వ్యవహరించాల్సిన ఘటనగానే కాక.. కాస్త వినోదాన్నీ అందించింది. చోరీకి వచ్చి ఎటూ కాలేకపోయి అక్కడే కునుకుతో దొరికిపోవడం ఓ అనుకోని వింత. అందుకే అంటారు.. ప్రతి దొంగ సినీ స్టైల్‌లో ఉండడు. కొందరైతే కథల్లోకే కాదు.. కథలకే మారిపోతారు.

ఇది కూడా చదవండి: మీరు ప్రతిరోజూ వాటర్ చెస్ట్‌నట్ తింటే ఏమవుతుంది? నిజాలివే!

Also Read :  హైదరాబాద్‌లో విచిత్రమైన ఏటీఎం చోరీయత్నం.. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా..!!

(crime news | crime | atm | Latest News | telugu-news | theft)

Advertisment
తాజా కథనాలు