/rtv/media/media_files/2025/06/17/j11xGSKxjSeAqRSnP16R.jpg)
UP man tries to kiss snake for reel, gets bitten
చాలా మంది పాములను చూడగానే పరుగులు పెడతారు. కానీ ఇంకొందరైతే పాములతోనే ఆటలాడుతుంటారు. అలా వాటితో ముచ్చటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ రైతు పాముతో సాహసం చేశాడు. దాన్ని మెడలో వేసుకుని నోటి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అది నాలుకపై కాటు వేసింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
Snake Video
उत्तर प्रदेश के अमरोहा जिले के इस व्यक्ति ने सांप को पकड़ा,
— Priyanshu Mishra 🎭 (@Apka_Priyanshu) June 15, 2025
फिर सांप के साथ खेलने लगा,
सांप से खुद की जीभ पर किस कराने जैसे करतब दिखाना शुरू किया,
अचानक सांप ने उसे जीभ पर ही काट लिया.
हालत गंभीर,
व्यक्ति अस्पताल में भर्ती है. pic.twitter.com/8roTgeI0ni
Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా హైబత్‌పుర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జితేంద్ర కుమార్ (50) అనే రైతు ఓ పామును రక్షించాడు. అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు పక్కన ఉన్నవారి సహాయంతో దాన్ని మెడలో వేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా దాన్ని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు.
Also read: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!
ఈ క్రమంలో పామును తన నాలుకకు దగ్గరగా తీసుకువచ్చాడు. దీంతో ఆ పాము ఒక్కసారిగా కాటు వేసింది. అలా కాటు వేసిన కాసేపటికే జితేంద్ర కుమార్ పరిస్థితి విషమించింది. దీంతో అతడిని వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.