/rtv/media/media_files/2025/02/20/xxUwyucRo6mPHZw8YVkh.webp)
Kaleshwaram commission
Kaleshwaram Commission
కాళేశ్వరం ప్రాజెక్ట్(kaleshwaram barrage) నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ కు కమిషన్ చీఫ్ గతంలోనే కోరినప్పటికి ఇంతవరకు ఇవ్వకపోవడంపై కమిషన్ సీరియస్ అయింది. ఈ విషయమై మరోసారి లేఖ రాశారు. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు కమిషన్ లేఖ రాసింది. తాజాగా మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్(KCR) స్టేట్మెంట్ తర్వాత మూడోసారి సర్కార్ కు కమిషన్ లేఖ రాసింది. గతంలో ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి… ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. ఇప్పుడు మూడోసారి లేఖ రాసింది.
Also Read: అర్జున్ బార్క్ టీ తాగడం వల్ల ఏమవుతుంది? తప్పక తెలుసుకోండి
గతంలో రాసిన లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదని కమిషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి లేఖ రాసిన కమిషన్, కేబినెట్ మినిట్స్ అందజేయడంపై సర్కార్‌పై ఒత్తిడి చేస్తోంది. ఈ అంశం రాష్ట్ర రాజకీయ, పరిపాలన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, ఆర్థిక అవకతవకలపై 2024 మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది. కానీ ఆ సమయంలో విచారణ పూర్తి కాలేదు. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల విచారణ సాగుతోంది. ముఖ్యంగా హరీశ్ రావు(harishrao), కేసీఆర్‌ను విచారించింది. మొదట వంద రోజుల్లో నివేదిక సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కమిషన్, ఇప్పటివరకు 100 మందికి పైగా ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. వారి నుంచి పలు వివరాలు సేకరించింది. అయితే, ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ మీటింగ్‌ల వివరాలు మాత్రం ఇంతవరకు అందలేదు. దీనిపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వడం వల్ల ప్రాజెక్టు కు సంబంధించిన నిర్ణయాలు, బాధ్యతలు ఖచ్చితంగా నిర్ధారించవచ్చని కమిషన్ భావిస్తోంది. ఒకవేళ అనుకున్న సమయానికి ప్రభుత్వం మనిట్స్ ఇవ్వకపోతే విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
kaleswaram-project
Follow Us