ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తనను సిట్ అధికారులు వేధిస్తున్నారంటూ తిరుపతి అర్బన్ కానిస్టేబుల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అతను ఆస్పత్రి పాలయ్యారు. సిట్ వేధింపులపై ఆయన డీజీపీకి సైతం లేఖ రాశారు. లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పాలంటూ సిట్ అధికారులు 2 రోజులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మదన్ గన్‌మెన్‌గా ఉన్నారు.
లిక్కర్ స్కామ్ కు సంబంధించి చెవిరెడ్డి రూ.200 కోట్లు- రూ 250 కోట్లు సమకూర్చారని చెప్పాలని సిట్ బలవంతం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ మదన్ కు చికిత్స అందిస్తున్నారు. సిట్ అధికారుల వేధింపులను ఆపాలంటూ ఆయన ఏపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంపై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..
ప్రభుత్వానికి AR హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ.
— greatandhra (@greatandhranews) June 17, 2025
పదేళ్లపాటు చెవిరెడ్డి దగ్గర గన్‌మెన్‌గా పని చేసిన మదన్ రెడ్డి
లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు అని డీజీపీ, సీఎం, డిప్యూటీ సీఎం కు లేఖ రాసిన మదన్ రెడ్డి .
నన్ను ఎప్పుడు… pic.twitter.com/NUCL53feCu
Also Read : TCS సంచలన నిర్ణయం.. బెంచ్‌పై ఇక 35 రోజులే
చెవిరెడ్డి అరెస్ట్..
ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే చెవిరెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ సిట్ ఆఫీసుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి కొలొంబో వెళ్లేందుకు చెవిరెడ్డి ప్రయత్నించగా.. పక్కా సమాచారంతో ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు ఏపీ పోలీసులు.
Also Read : సత్తెనపల్లిలో హైటెన్షన్.. జగన్ పర్యటన ఉంటుందా? ఉండదా?
Also Read : ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన చైనా
telugu breaking news | ap liquor scam | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news | tirupati | chevireddy-bhaskar-reddy
Follow Us