TCS సంచలన నిర్ణయం.. బెంచ్‌పై ఇక 35 రోజులే

ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి ఉద్యోగి ఏటా 225 బిల్ల్‌డ్‌ బిజినెస్‌ రోజులు పనిచేసి ఉండాలనే రూల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం బెంచ్‌ మీద ఉద్యోగులు కేవలం 35 రోజులు మాత్రమే ఉంటారు.

New Update
TCS New Bench Policy, new rule limits the bench period to 35 days per year

TCS New Bench Policy, new rule limits the bench period to 35 days per year

ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి ఉద్యోగి ఏటా 225 బిల్ల్‌డ్‌ బిజినెస్‌ రోజులు పనిచేసి ఉండాలనే రూల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం బెంచ్‌ మీద ఉద్యోగులు కేవలం 35 రోజులు మాత్రమే ఉంటారు. జూన్ 12 నుంచి ఈ కొత్త రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు పనిచేయని సమయాన్ని తగ్గించడం, వర్క్‌ఫోర్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకునేందుకే టీఎసీఎస్‌ ఈ పాలసీని తీసుకొచ్చింది. 

Also read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

TCS New Bench Policy

ఐటీలో బిల్ల్‌డ్‌ డేస్ అంటే క్లయింట్‌ ఇచ్చే ప్రాజెక్టుపై పనిచేయాల్సిన రోజులు. దీన్ని ఏడాదికి 225 రోజులుగా TCS తాజాగా నిర్ణయించింది. అంటే టీఎసీఎస్‌లో చేరిన ప్రతీ ఉద్యోగి కూడా ఎక్కువ రోజుల పాటు ప్రాజెక్టులపై పనిచేయాలి. ఏ ప్రాజెక్టుపై పనిచేయకుండా ఉండే ఖాళీ సమయాన్ని బెంచ్ పీరియడ్ అని అంటారు. అయితే దీన్ని టీసీఎస్‌ ఇప్పుడు కేవలం 35 రోజులకు మాత్రమే పరిమితం చేసింది. 

Also Read: ఖమేనీని లేపేస్తేనే యుద్ధం ముగిస్తోంది.. నెతన్యాహు సంచలన ప్రకటన

ఎక్కువ రోజుల పాటు ఏ ఉద్యోగిని కూడా ఖాళీగా ఉంచకూడదనేది ఈ కొత్త పాలసీ ఉద్దేశం. ఇలా జరిగితే ఉద్యోగి శాలరీ, కేరీర్‌లో వృద్ధి, ఉద్యోగ జీవింతపై కూడా ప్రభావం పడుతుందని టీఎసీఎస్‌ తన పాలసీ డాక్యుమెంట్‌లో తెలిపింది. ఇదిలాఉండగా.. టీఎసీఎస్‌లో ఏ ప్రాజెక్టుకు ఎవరు సరిపోతారు ? ఎవరి స్కిల్స్‌ సరిపోతాయనేవి రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్ (RMG) చూస్తుంది. దీనికి గ్లోబల్‌ హెడ్‌గా చంద్రశేఖరన్ రామ్‌కుమార్ ఉన్నారు. ఆయన నిర్ణయానికి అనుగుణంగానే ఈ కొత్త పాలసీ రూపుదిద్దుకుంది. 

Also Read: కన్నప్ప టీంపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు!

Also Read :  కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

 

software | it-company | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | IT Jobs

Advertisment
Advertisment
తాజా కథనాలు