/rtv/media/media_files/2025/05/24/ztQFw3DxAjdf5H7fvXBy.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
Trump VS Harvard: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి
హార్వర్డ్ విషయంలో ట్రంప్ ఆటలు సాగడం లేదు. యూనివర్శిటీకి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చాలా గట్టిగానే అడ్డంకులు పడుతున్నాయి. హార్వర్డ్ యూనివర్శిటీ అధికారులు కూడా అమెరికా ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేదే లేదు అన్నట్టు ప్రవర్తిస్తోంది. తాజాగా విదేశీ విద్యార్థుల అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే విదేశీ విద్యార్థులను వెనక్కు పంపేయాలని ఆజ్ఞలు జారీ చేసింది.
Also Read: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం
దీనిపై యూనివర్శిటీ కోర్టుకెక్కింది. ఇంతకు ముందు విశ్వవిద్యాలయం గ్రాంట్స్ కట్ట చేసినప్పుడు కూడా ఇలాగే ఫైట్ చేసింది. ఇప్పుడు కూడా విదేశీ విద్యార్థుల అనుమతి నిషేధంపై కోర్టుకు వెళ్ళింది యూనివర్శిటీ. అక్కడ హార్వర్డ్ కు అనుకూలంగా జడ్జి తీర్పు ఇవ్వండతో ట్రంప్ ప్రభుత్వానికి చెక్ పడ్డట్టయింది. బోస్టన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అలిసన్ బరోస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
విద్యార్థులకు అన్యాయం..
హార్వర్డ్ లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులు వీసా కోసం అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్‌తో విద్యార్థులు వీసాకు అప్లై చేస్తారు. అలాంటప్పుడు ఎస్‌ఈవీపీ సిస్టమ్ నుంచి హార్వర్డ్ ను తొలగించడం చాలా అన్యాయమంటూ యూనివర్శిటీ పిటిషన్ వేసింది.
Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఒక్క నిర్ణయంతో విశ్వవిద్యాయంలో పావు వంతు స్టూడెంట్స కు అన్యాయం చేయదలుచుకున్నారని చెప్పింది. దీని వలన చాలా మంది భవిష్యత్తు గల్లంతు అవుతుందంటూ మొరపెట్టుకుంది. 140కి పైగా దేశాల్లోని విద్యార్థులు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న, త్వరలో రాబోయే విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 7,000 మంది. అమెరికా ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఇలా విద్యార్థులను కషటపెట్టడం సముచితం కాదని కోర్టులో చెప్పింది. దీన్ని పరిగలోకి తీసుకున్న జడ్జి ప్రభుత్వ నిషేధం నిర్ణయాన్ని ఆపాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన
today-latest-news-in-telugu | usa | america president donald trump | Trump Vs Harvard
-
May 24, 2025 11:04 IST
Israel: ఆహారం కోసం ఎగబడుతున్న గాజా ప్రజలు.. WHO కీలక ప్రకటన
-
May 24, 2025 10:59 IST
Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకున్న కుటుంబంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి ఆ బాలుడిని తమిళనాడులో రహస్యంగా పాతిపెట్టారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
Andhra pradesh tribal boy left by mother as collateral killed in captivity in tamil nadu -
May 24, 2025 10:45 IST
King Cobra on Bed UP: వణుకు పుట్టించే వీడియో..!! పడుకున్న వ్యక్తి పక్కలో దూరిన భారీ నాగుపాము.. (Viral Video)
-
May 24, 2025 10:17 IST
MH: డ్రగ్స్ ఇచ్చి వైద్య విద్యార్థిపై గ్యాంగ్ రేప్ చేసిన క్లాస్ మేట్స్
-
May 24, 2025 07:17 IST
Pak: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన
పాకిస్తాన్ నేతలు, ఆర్మీ అధికారుల మాటలకు హద్దు పద్దు లేకుండా పోతోంది. దాడులు చేస్తే తోకలు ముడిచినవారు ఇప్పుడు మళ్ళీ నోటికొచ్చినట్టు వాగుతూ రెచ్చిపోతున్నారు. సింధుజలాలు ఆపేస్తే భారత ప్రజల శ్వాసను ఆపేస్తామంటూ పాక్ ఆర్మీ అధికారి అహ్మద్ షరీఫ్ మాట్లాడారు.
Pakistan Army spokesperson Lieutenant General Ahmed Sharif and LeT chief Hafiz Saeed. -
May 24, 2025 07:17 IST
Trump VS Harvard: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి
-
May 24, 2025 07:16 IST
CRPF: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
-
May 24, 2025 07:15 IST
SRH VS RCB: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం