Israel: ఆహారం కోసం ఎగబడుతున్న గాజా ప్రజలు.. WHO కీలక ప్రకటన

గాజా ప్రజలకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్‌ దయ చూపాలని WHO చీఫ్‌ టెడ్రోస్‌ అధోనమ్‌ విజ్ఞప్తి చేశారు.

New Update
Tedros Adhanom Ghebreyesus

Tedros Adhanom Ghebreyesus

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తూనే ఉంది. దీంతో అక్కడి పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయి. గాజా ప్రజలకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ యుద్ధం అత్యంత క్రూరదశలో ఉందని వాపోయారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గాజాకి 400 ట్రక్కుల్లో సాయం ప్రవేశిస్తే.. కేవలం 115 ట్రక్కుల సాయం మాత్రమే ఇప్పటివరకు మాత్రమే ఇప్పటిదాకా అందిందని తెలిపారు. 

Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం

గాజా ప్రజలకు ఇప్పుడు వరదలా సాయం అందాల్సిన అవసరం ఉందన్నారు. కానీ వాళ్లకి చెంచాడంత సాయం మాత్రమే లభిస్తోందని అన్నారు.  మరోవైపు గాజాలోని పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శరణార్థులకు అందించే ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరమని చెప్పింది. ఇజ్రాయెల్‌ ఆ ప్రజలపై కాస్త దయచూపాలని కోరింది. WHO అధిపతి టెడ్రోస్‌ అధనోమ్‌ ఆ సంస్థ వార్షిక సమావేశంలో భావోద్వేగ ప్రసంగం చేశారు. 

Also Read: భారత్‌ నుంచి కీలక కాంట్రాక్ట్‌ రద్దు చేసుకున్న బంగ్లాదేశ్

గాజాలో ప్రస్తుతం ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోగలనని అన్నారు. యుద్ధం వల్ల వచ్చిన భయానక పరిస్థితులు ప్రజలను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నాయని అన్నారు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ సమయాల్లో ఆహారాన్ని, వైద్య సదుపాయాలు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఘర్షణలతో శాశ్వత పరిష్కారం లభించదని.. గాజాపై ఇజ్రాయెల్‌ దయ చూపాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా గడిచిన 24 గంటల్లో గాజాలో 60 మంది పౌరులు మరణించినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. 

Also Read: కేసీఆర్ చుట్టూ 2 దెయ్యాలు.. కవిత షాకింగ్ కామెంట్స్

Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి

 telugu-news | gaza | israel | Israel Hamas War 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు