/rtv/media/media_files/2025/05/24/2pHug48MuP5rjHZxwuVJ.jpg)
Andhra pradesh tribal boy left by mother as collateral killed in captivity in tamil nadu
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకున్న ఓ గిరిజన కుటుంబంలో విషాదం నెలకొంది. ఆ కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలుడిని చంపేసి రహస్యంగా పాతిపెట్టడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. జిల్లాలలోని చెవటపాలెం గ్రామంలో అనకమ్మ (32), చెంచయ్య దంపతులు ఉండేవారు. వీళ్లు సత్యవేడు గ్రామంలోని ముత్తు అనే బాతులు పెంచే వ్యాపారి వద్ద ఓ ఏడాది పాటు పనిచేశారు.
ఆ తర్వాత చెంచయ్య మృతి చెందాడు. దీంతో అక్కడి స్థానిక వ్యక్తి చెంచయ్య కుటుంబానికి రూ.25 వేల అప్పు ఇచ్చానంటూ ఆరోపణలు చేశాడు. దీంతో ఆ వ్యాపారి ముత్తు.. అప్పు తీర్చేందుకు డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ దీనికి ఒక షరతు పెట్టాడు. ఆ కుటుంబం అప్పు తీర్చేవరకు తన వద్ద పనిచేయాలని చెప్పాడు. దీనికి అనకమ్మ ఒప్పుకుంది.
ఇందుకోసం తన 12 ఏళ్ల కొడుకుతో పాటు ఆమె ఆ ముత్తు వద్దే పనిచేసింది. వాళ్లతో ముత్తు ఎక్కువగా పని చేయించుకునేవాడు. కొన్నిరోజులకే ఆ పని చాలా కష్టంగా మారిపోయింది. దీంతో అనకమ్మ ఎక్కవ జీతం ఇవ్వాలని ముత్తుని అడిగింది. కానీ అతడు ఇందుకు ఒప్పుకోలేదు. మమ్మల్ని వదిలేయాలని ఆమె వేడుకోగా.. అతడు తనకు రూ.45 వేలు కట్టాలని డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఒకేసారి కట్టే స్తోమత వాళ్ల దగ్గర లేదు. దీంతో ముత్తు మరో షరతు పెట్టాడు.
Also Read: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు!
ఆ అప్పు తీర్చే వరకు అనకమ్మ కొడుకుని తన వద్దే పెట్టుకొని పని చేయించుకుంటానని చెబుతాడు. దీనికి కూడా అనకమ్మ ఒప్పుకుంటుంది. దీంతో ముత్తు ఆ బాలుడితో ఎక్కువసేపు పని చేయించుకునేవాడు. దీంతో ఎలాగైన ఆ అప్పు తీర్చి తన కొడుకుని ఆ వ్యాపారి నుంచి తీసుకురావాలని అనకమ్మ అనుకుంటుంది. ముత్తు ఫోన్ నుంచి కూడా ఆ బాలుడు ఫోన్ చేసి తన బాధ గురించి తల్లికి చెబుతుండేవాడు. పని చాలా కష్టంగా ఉందని, ఎక్కువ గంటల పాటు పని చేయిస్తున్నారని ఆవేదన చెందేవాడు. చివరగా ఏప్రిల్ 15న ఆ బాలుడు తల్లి అనకమ్మకు ఫోన్ చేశాడు.
ఇక ఎట్టకేలకు అనకమ్మ అప్పు తీర్చాల్సిన డబ్బును పోగేసింది. మే మొదటివారంలో తన కొడుకును తీసుకెళ్లేందుకు ఆ వ్యాపారి ముత్తు వద్దకు వచ్చింది. కానీ అతడు తన కొడుకు ఎక్కడికో పారిపోయాడని చెబుతాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయిస్తుంది. ఆ బాలుడి ఆచూకి కోసం పోలీసులు రంగంలోకి దిగినా అతడి జాడ కనిపించలేదు. దీంతో ఆమె స్థానిక నేతల సాయం కోరుతుంది. చివరికి జిల్లా ఎస్పీ వద్ద ఆమె తన సమస్యను చెప్పుకుంది.
Also Read: 43 ఏళ్లు జైల్లోనే.. నిర్దోషిగా విడుదలైన 104 ఏళ్ల వృద్ధుడు
దీంతో ఆయన దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తారు. ముత్తుని అరెస్టు చేసి విచారిస్తారు. ఈ విచారణలో ముత్తు ఆ బాలుడు చనిపోయాడని.. తమిళనాడులో కంచిపురంలో రహస్యంగా అతడిని పాతిపెట్టినట్లు అంగీకరిస్తాడు. చివరికి ఆ బాలుడిని పోలీసులు బయటికీ తీయించారు. కొడుకుకి ఇలా జరగడాన్ని చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. అయితే ఆ బాలుడిని కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
Mother inconsolable after 9-yr-old son who she was forced to leave behind as collateral in #Tirupati against Rs 25k loan, found out child was mercilessly beaten, shoulder-head broken, killed & secretly buried in #Kanchipuram #TN; 3 of family who held him as #BondedLabour arrested pic.twitter.com/XEimEi1mW0
— Uma Sudhir (@umasudhir) May 23, 2025
Andhra Pradesh | crime news | rtv-news