MH:  డ్రగ్స్ ఇచ్చి వైద్య విద్యార్థిపై గ్యాంగ్ రేప్ చేసిన క్లాస్ మేట్స్

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తమతో పాటూ చదువుకున్న అమ్మాయిని స్నేహితులే కాటేశారు. డ్రగ్స్ ఇచ్చి మరీ రేప్ చేశారు. బాధితురాలికి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ 22 ఏళ్ళు లోపువారే .

New Update
Haryana Gang Rape

MBBS Student Gang Rape

అమ్మాయిలు ఆట వస్తువులుగా మారిపోయి చాలా రోజులు అయింది. ప్రపంచంలో ప్రతీ నిమిషం ఎక్కడో ఒక చోట బలవుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో మరో అమ్మాయికి అన్యాయం జరిగింది. తోటి విద్యార్థులే క్లాస్ మేట్ ను డ్రగ్స్ ఇచ్చ మరీ రేప్ చేశారు. అది కూడా వైద్య విద్యను అభ్యసిస్తున్న కుర్రాళ్ళు చేసిన దారుణం ఇది. వైద్య వృత్తికే కళంకం తెచ్చిన ఈ సంఘటన అందరినీ కలిచి వేసింది. మత్తు మందు ఇచ్చి సహచర విద్యార్థినిపై ముగ్గురు వైద్య విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తోటి విద్యార్థులే..

కర్ణాటకలోని బెలగావికి చెందిన అమ్మాయి హారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఎంబీబీఎస్ చదువుతోంది. మే 18న తన క్లాస్ మేట్స్ తో కలిసి నైట్ షో సినిమాకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంది. అయితే ఇదే అదనుగా భావించిన ఆమె స్నేహితులు ముందు ఆ అమ్మాయి చేత మందు తాగించారు. అందులో ఆమెకు తెలియకుండా డ్రగ్స్ కూడా కలిపారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తరువాత విద్యార్థినిపై ఒకరి తర్వాత ఒకరు ముగ్గురూ అత్యాచారం చేశారు. స్పృహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించింది. స్నేహితులను ముగ్గురినీ ప్రశ్నించింది.  దీంతో ముగ్గురు నిందితులూ విద్యార్థినిపై బెదిరింపులకు దిగారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. 

అయితే ఆ అమ్మాయి మాత్రం తనకు జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు విశ్రాంగ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద సామూహిక అత్యాచారం, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. దీంతో పూణె, షోలాపూర్, సాంగ్లికి చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  న్యాయస్థానం ముగ్గురు విద్యార్థులకు మ 27వరకు కస్టడీ విధించింది. 

today-latest-news-in-telugu | maharstra | gang-rape | mbbs-student

Also Read: UN: పాకిస్తాన్ ది అంతా నాటకమే..యూఎన్ లో విరుచుకుపడ్డ భారత్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు