Donald Trump: మరో కంపెనీకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఈ దేశాల్లో తయారు చేస్తే సుంకం తప్పదు

శాంసంగ్‌తో పాటు మిగతా స్మార్ట్‌ఫోన్లకు 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. శాంసంగ్‌తో పాటు మిగతా కంపెనీ ఉత్పత్తులను కూడా అమెరికాలోనే తయారు చేయాలి. లేకపోతే టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల యాపిల్ సంస్థకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడు మరో కంపెనీకి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శాంసంగ్ మొబైల్ కంపెనీకి కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో విక్రయించే శాంసంగ్‌తో పాటు అన్ని స్మార్ట్‌ఫోన్లకు 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు తెలిపారు. కేవలం యాపిల్ సంస్థ మాత్రమే కాదని, శాంసంగ్‌తో పాటు మిగతా కంపెనీ ఉత్పత్తులను కూడా అమెరికాలోనే తయారు చేయాలన్నారు. అక్కడ ప్లాంట్ నిర్మిస్తే టారిఫ్‌లు ఉండవు. అదే ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసినవి తీసుకురావడం న్యాయం కాదన్నారు. 

ఇది కూడా చూడండి: Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు

ఇది కూడా చూడండి: Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!

యాపిల్ సంస్థకు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పెట్టుబడులు పెట్టవద్దని యాపిల్ సంస్థకు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. పెట్టుబడులు ఇండియాలో పెడితే 25 శాతం టారిఫ్ విధిస్తామంటూ హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను యాపిల్ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు. ఇండియాలోనే ఐఫోన్ తయారీకి మొగ్గు చూపుతుంది.

అమెరికాలో విక్రయించే ఐఫోన్లను యూనైటెడ్ స్టేట్స్‌లో తయారు చేయాలని, భారత్ లేదా మరో దేశంలో తయారు చేస్తే 25 శాంతం సుంకం యాపిల్ సంస్థ అమెరికాకు చెల్లించాలని అన్నారు. అయితే ట్రంప్ ఇలా పోస్ట్ చేసిన వెంటనే యాపిల్ షేర్లు మూడు శాతం పడిపోయినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Ind Vs Eng: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!

 

latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు