Actor Mukul Dev Dies at 54: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. 'అదుర్స్' విలన్ కన్నుమూత.

బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ (54) మే 23న కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించి ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన రాహుల్ దేవ్ సోదరుడు కాగా, తెలుగులో 'అదుర్స్', 'ఏక్ నిరంజన్', 'కృష్ణ' సినిమాలలో విలన్‌గా నటించారు.

New Update
Actor Mukul Dev Dies at 54

Actor Mukul Dev Dies at 54

Actor Mukul Dev Dies at 54: బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ మే 23న కన్నుమూశారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయనకు ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 54 ఏళ్ల ముకుల్ దేవ్ మరణం చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది. ముకుల్ దేవ్ ప్రముఖ నటుడు రాహుల్ దేవ్(విలన్) సోదరుడు, తెలుగు లో అదుర్స్, ఏక్ నిరంజన్, వంటి సినిమాలలో విలన్ గా నటించారు..

‘సన్ ఆఫ్ సర్దార్’ సినిమాలో ముఖుల్‌తో కలిసి నటించిన విందూ దారా సింగ్, ముఖుల్ చివరికి తనని తానే దూరంగా ఉంచుకున్నారని, తల్లిదండ్రుల మరణం తర్వాత బయటకు రావడం లేదని, ఎవరిని కలవడం కూడా మానేశారని తెలిపారు. 'ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, కానీ ఇలా జరగడం దురదృష్టకరం. ఆయన సోదరుడు రాహుల్ దేవ్‌కి, ముకుల్ ను ప్రేమించిన అందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. మేమంతా ఆయనను మిస్ అవుతున్నాము," అని విందూ భావోద్వేగంగా తెలిపారు.

mukul dev
mukul dev

ముఖుల్ దేవ్ సన్నిహిత స్నేహితురాలు, నటి దీప్శిఖా నాగ్‌పాల్ కూడా ఈ విషాద వార్తపై స్పందించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ముఖుల్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. "ఆయన ఎప్పుడూ తన ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. మా వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్‌లో మేము తరచూ మాట్లాడుకునేవాళ్లం. ఈ ఉదయం ఈ వార్త విని షాక్‌కు గురయ్యాను." అంటూ భావోద్వేగ పోస్ట్ చేసారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు