Pakistani Infiltrator: గుజరాత్‌లో పాకిస్తాన్ చొరబాటుదారున్ని కాల్చి చంపిన సైన్యం

భారత్ భూబాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ వ్యక్తిని ఇండియన్ BSF కాల్చి చంపింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్‌ లోని బనస్కాంత్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని భద్రతా బలగాలు ప్రకటించాయి.

New Update
Pakistani infiltrator

భారత్ భూబాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ వ్యక్తిని ఇండియన్ BSF కాల్చి చంపింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్‌ లోని బనస్కాంత్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని భద్రతా బలగాలు ప్రకటించాయి. బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సరిహద్దును దాటి కంచె వైపు వస్తున్న ఓ పాకిస్థాన్‌ వ్యక్తిని భారత జవాన్‌లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. అక్కడే ఆగిపోవాలని హెచ్చరించారు. అయినా అతడు లెక్కచేయకుండా ముందుకు రావడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Also Read :  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి

Pakistani Infiltrator In Gujarat

Also Read :  మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!

ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఏప్రిల్‌ 22న పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యటకులను విచక్షణారహితంగా కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య పరస్పరం వైమానిక దాడులు జరిగాయి.

Also Read :  గుజరాత్‌లో పాకిస్తాన్ చొరబాటుదారున్ని కాల్చి చంపిన సైన్యం

Also Read :  దేశంలో కరోనా కొత్త వేరియంట్లు!

BSF Constable | 2025 india pakistan war | gujarat | ceasefire | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు