CRPF: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం

కేంద్రం వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల్లో అమరులైన ఇద్దరు CRPF జవాన్లతో పాటు మరో ఐదుగురికి శౌర్య చక్ర పతకం వరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి గురువారం పతకాలు అందజేశారు.

New Update
CRPF commandos honoured with Shaurya Chakra for anti-Naxal operations

CRPF commandos honoured with Shaurya Chakra for anti-Naxal operations

కేంద్రం వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల్లో అమరులైన ఇద్దరు CRPF జవాన్లతో పాటు మరో ఐదుగురికి శౌర్య చక్ర పతకం వరించింది.  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి గురువారం పతకాలు అందజేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా టేకల్‌గూడలో గతేడాది జనవరి 30న CRPF బెటాలియన్ ఫార్వర్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌ను ఏర్పాటు చేసింది. అయితే అప్పుడు మావోయిస్టులు ఆయుధాలతో విరుచుకుపడ్డారు.  

Also Read: కేసీఆర్ చుట్టూ 2 దెయ్యాలు.. కవిత షాకింగ్ కామెంట్స్

కానీ 201 కోబ్రా బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ పవన్‌ కుమార్‌, మరో కానిస్టేబుల్‌ దేవన్‌ ప్రాణాలకు తెగించి పోరాడారు. దీంతో వారు మావోయిస్టుల చేతిలో మరణించారు. వారి ధైర్యం పరాక్రమానికి మరణానంతం కేంద్ర ప్రభుత్వం శౌర్యచక్రతో సత్కరించింది. వీళ్ల కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి పతకం అందించారు. అలాగే ఈ కోబ్రా యూనిట్‌కు చెందిన డిప్యూటీ కమాండెంట్‌ లఖ్వీర్‌, కానిస్టేబుల్‌ మల్కిత్‌ సింగ్‌,  అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాజేశ్‌ పంచల్‌ అసాధారణ ధైర్యానికి కూడా శౌర్యచక్ర పతకం అందించింది కేంద్రం. లఖ్వీర్‌కు పేలుళ్లలో గాయాలయ్యాయి. ఆయన కుడి చేతికి తూటా కూడా తగిలింది. మల్కిత్‌ సింగ్‌ తుపాకీ గుళ్లకు ఎదురెళ్లి మరి చాలామంది మావోయిస్టులను కాల్చిచంపాడు. 

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

ఇక 2023 ఏప్రిల్‌ 3న ఝార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో జరిగిన మరో ఆపరేషన్‌లో CRPF 203 కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ జెఫ్రీ హమింగ్‌చుల్లో, డిప్యూటీ కమాండెంట్‌ విక్రాంత్‌ కుమార్ శౌర్యచక్ర అందుకున్నారు. మావోయిస్టులతో దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన పోరులో వీళ్లు ఐదుగురు మావోయిస్టు అగ్రనేతలను కాల్చిచంపారు. 

Also Read: 43 ఏళ్లు జైల్లోనే.. నిర్దోషిగా విడుదలైన 104 ఏళ్ల వృద్ధుడు

Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన

 telugu-news | central-govt | national-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు