/rtv/media/media_files/2025/05/23/DTPhZANweBEeTTIsOu31.jpg)
Pakistan Army spokesperson Lieutenant General Ahmed Sharif and LeT chief Hafiz Saeed.
పహల్గాం దిడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీని కారణంగా ఇరు దేశాల మద్యనా దౌత్య సంబంధాలు చెడిపోయాయి. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందనే కారణంగా పాక్ పై భారత్ అనేక చర్యలను తీసుకుంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది సింధు జలాల ఆపివేత ఒకటి. పాకిస్తాన్ కు ఈ నీరు అత్యంత ముఖ్యం. ఇవి లేకపోతే వారి మనుగడ కష్టం అవుతుంది. అలాంటప్పుడు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ పాకిస్తాన్ నేతలు కానీ, ఆర్మీ అధకారులు కానీ దానిని గుర్తించడం లేదు. ఎప్పటికప్పుడు నోటికొచ్చినట్టు వాగుతూ సమస్యను మరింత పెద్ది చేుకుంటున్నారు.
సింధుజలాలపై ప్రేలాపన..
భారత్, పాక్ ల మధ్య యుద్ధం ఆగినా ఉద్రిక్త పరిస్థితులు మాత్రం చక్కబడలేదు. పాక్ మీద పెట్టిన ఆంక్షలు విషంలో తగ్గేదే లేదు అంటోంది భారత్. అటు వైపు నుంచి ఎంత కష్టపడుతున్నా తాము కూడా మొండిగానే ఉంటామంటోంది పాక్. దానికి తోడు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అనవసరమైన వాగ్వాదాలకు దిగుతోంది. తాజాగా పాకిస్తాన్ లెఫ్టినెంట్ ఆర్మీ జనరల్ అహ్మద్ షరీఫ్ సింధు జలాల మీద మరోసారి పిచ్చి వాగుడు వాగారు. పాక్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అహ్మద్ షరీఫ్ ప్రసంగిస్తూ..‘‘భారత్ మాకు వచ్చే నీటిని అడ్డుకుంటే అక్కడి ప్రజల ఊపిరి ఆపేస్తాం. సింధూ నదిలో జలాలకు బదులుగా వారి రక్తం పారుతుంది’’ అని అన్నారు. సింధూ జలాల గురించి పాక్ నేతలు, అధికారులు , ఆఖరుకి ఉగ్రవాదులు కూడా ఇదే మాటలను పదేపదే అంటున్నారు. దీనిపై భారత్ తో పాటూ ఇతర దేశాల వాళ్ళు కూడా మండిపడుతున్నారు. ఇంతకు ముందు లష్కరే తోయిబా ఛీఫ్ హఫీజ్ సయీద్ కూడా ఇదే మాట అన్నారు. కశ్మీర్‌లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్‌కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్‌ను నాశనం చేయాలని, చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే.. నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది అంటూ హఫీజ్ బెదిరించారు. ఇప్పుడు పాక్ ఆర్మీ అధికారి అదే మాట్లాడడంతో..ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని అంటున్నారు.
today-latest-news-in-telugu | pakistan | army-officer | indus water treaty