/rtv/media/media_files/2025/05/24/6WWMVWPVhMGs4ACIZ1yp.jpg)
Telangana Minister Ponguleti Srinivas Reddy
స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.. ఆస్తుల క్రయ, విక్రయదారులకు పారదర్శకంగా, అవినీతి రహితంగా సమయం ఆదా అయ్యేలా మెరుగైన సేవలు అందించనున్నట్లు చెప్పారు. ప్రయోగాత్మకంగా మొదటి దశలో ఏప్రిల్ 10వ తేదీన 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
Also Read : సిగ్గుందరా .. మరో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు
Also Read : మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్.. వేశ్యలా చూశారన్న బాధతో!!
TG Minister Ponguleti Over Slot Booking In Registrations
ఇక్కడ మంచి ఫలితాలు రావడంతో ఈనెల 12వ తేదీ నుంచి 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు విడతలు కలిపి 47 చోట్ల అమలు చేసిన విధానం విజయవంతమైందన్నారు. ప్రజల నుంచి ఇందుకు అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ విధానంపై 94 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఈ రెండు విడతల్లో కలిపి దాదాపు 36 వేల రిజిస్ట్రేషన్‌లు జరిగాయని తెలిపారు. ఇప్పటికే అమలులో ఉన్న 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మాదిరిగానే మిగిలిన 97 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read : విజయవాడ రైల్వేస్టేషన్ లో బాంబ్ కలకలం
Also Read : తాళికట్టే సమయంలో వరుడికి బిగ్ షాకిచ్చిన పెళ్లికూతురు
(Ponguleti Srinivasa Reddy latest news | telugu-news | telugu breaking news | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news live updates | telangana-news-updates)