Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగానే

నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది.

New Update
 Monsoon arrives in Kerala, earliest onset since 2009, Says IMD

Monsoon arrives in Kerala, earliest onset since 2009, Says IMD


Monsoon: నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. మరో రెండు, మూడు రోజుల్లో ఇవి ఏపీలోకి ప్రవేశించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  

Also Read: దారుణం.. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో నిద్రిస్తున్న వ్యక్తి మృతి

జూన్ 1 నాటికి సాధారణంగా రుతుపవనాలు వస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం చాలా ముందుగానే వచ్చేశాయి. అంచనాల కంటే చాలా ముందు రావడం 16 ఏళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2009లో మే 23న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. గతేడాది మే 30న రుతుపవనాలు కేరళను తాకాయి. 2023లో మాత్రం జూన్ 8న నైరుతి ప్రవేశించింది. ఆ ఏడాది వారం రోజులు ఆలస్యంగా వచ్చింది. 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకాయి. 

Also Read: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు

ఇదిలాఉండగా ఈసారి వర్షకాలంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మన దేశంలో ఉన్న 52 శాతం నికర సాగుభూమికి ఇప్పుడొచ్చే వర్షపాతమే ప్రధానాధారం. దేశ వ్యవసాయ ఉత్పత్తిలో చూసుకుంటే ఈ సాగు భూమి నుంచే 42 శాతం దిగుబడి వస్తుంది. అందుకోసమే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి నైరుతి రుతుపవనాలు చాలా కీలకం. దేశంలో తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, జీడీపీకి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. 

Also Read: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు

Also Read: జర్మనీలో రెచ్చిపోయిన దుండుగురాలు..రైల్వే ఫ్లాట్ ఫామ్ లో దాడి..17 మందికి గాయాలు

telugu-news | rtv-news | monsoon | kerala | weather 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు