Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!

హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు కొడాలి నాని హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరో వైపు నిన్న కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసులు.. అరెస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

New Update
Kodali Nani Latest Photos

Kodali Nani Latest Photos

వైసీపీ కీలక నేత కొడాలి నాని హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ లో నిన్న రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నానికి హార్ట్ ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే.. నాని ఆరోగ్యం ఇంకా సెట్ కాలేదని.. మెరుగౌన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

నిన్న లుకౌట్ నోటీసులు..

అయితే.. నిన్న కృష్ణ జిల్లా ఎస్పీ నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. నాని అమెరికా వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ నోటీసులు జారీ అయినట్లు ప్రచారం జరిగింది. ఇది జరిగిన కొద్ది గంటలకే నాని హైదరాబాద్లో ఓ వివాహ వేడుకకు హాజరు అయినట్లు ఫొటోలు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. వివిధ కేసులు నమోదైన నేపథ్యంలో త్వరలోనే నాని అరెస్ట్ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

(telugu-news | telugu breaking news | KODALI NANI )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు