Amazon: ఆర్డర్ చేసిన గంటలోనే డోర్ డెలివరీ చేసే అమెజాన్‌ డ్రోన్లు

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ డ్రోన్‌‌తో డోర్ డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేసింది. లాజిస్టిక్స్ రంగంలో ప్రైమ్ ఎయిర్ అనే డ్రోన్ ఆధారిత డెలివరీ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఆర్డర్ చేసిన వస్తువులను గంటలోపే అందించాలనేది దీని లక్ష్యం.

New Update
Amazon  drone delivery

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ డ్రోన్‌‌తో డోర్ డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేసింది. లాజిస్టిక్స్ రంగంలో ప్రైమ్ ఎయిర్ అనే డ్రోన్ ఆధారిత డెలివరీ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఆర్డర్ చేసిన వస్తువులను గంటలోపే అందించాలనేది దీని లక్ష్యం. ఐఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి గాడ్జెట్‌లను డెలివరీ చేసే విధానాన్ని ఈ సర్వీస్ మార్చనుంది. అధికారిక X   పేజీలో ఈ విషయాన్ని అమెజాన్ ఇలా పోస్ట్ చేసింది. ఐఫోన్లు అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామని కంపెనీ చెబుతోంది.

Also Read :  దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

Amazon Drone Delivery

Also Read :  నాని హిట్ 3 ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. రికార్డులు బద్దలు కావడం పక్కా

అమెరికాలోని కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో డ్రోన్ డెలివరీని పొందవచ్చు కస్టమర్లు. ఫోన్‌లు, ఇయర్ ఫోన్స్, స్మార్ట్ రింగ్‌లు, వీడియో డోర్‌బెల్స్ వంటి ఉత్పత్తులను ఇప్పుడు MK30 డ్రోన్‌లను ఉపయోగించి డెలివరీ చేస్తోంది. ఈ డ్రోన్‌లు ఒక గంటలోపు డెలివరీని నిర్ధారిస్తాయి. కొన్నిసార్లు కేవలం 10 నిమిషాల్లోనే ఆర్డర్ చేసిన వస్తువులను అందిస్తాయట.

Also Read :  రేవంత్, స్టాలిన్, చంద్రబాబుతో ప్రధాని నవ్వులే నవ్వులు

MK30 డ్రోన్లు ఇంటికి దగ్గరిలోకి వచ్చి ఓపెన్ ప్లేస్‌లో ల్యాండ్ అయ్యేటట్లు ప్రోగ్రామ్ చేస్తారు. అవి దాదాపు 13 అడుగుల ఎత్తులో ఎగురుతూ ప్యాకేజీని సున్నితంగా డెలివరీ చేస్తాయి. ఇది వరకు కరెక్ట్ కస్టమర్లకే డెలివరీ అందేటట్లు QR కోడ్‌లు సెట్ చేసేవారు. కానీ ఇప్పుడు కోడ్‌లు లేకుండా ప్యాకేజీని ఎక్కడ విడుదల చేయాలో ఆన్‌బోర్డ్ సిస్టమ్ తెలివిగా గుర్తిస్తుంది.

Also Read :  మీకసలు మానవత్వం ఉందా?: వంశీని చంపేస్తారా?: పేర్ని నాని ఎమోషనల్!

amazon | drone delivery | amazon-prime | amazon-prime-customers | drone | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు