Ind Vs Eng: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!

ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 5మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ ను కెప్టెన్‌గా ఎంచుకుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ తర్వాత మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే.  

New Update
test bcci

BCCI announces Indian Test squad for England tour

IND vs ENG: ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శుభ్ మన్ గిల్ ను కెప్టెన్‌గా ఎంచుకుంది.  రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించిది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడబోయే మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే.  

Also Read: వణుకు పుట్టించే వీడియో..!! పడుకున్న వ్యక్తి పక్కలో దూరిన భారీ నాగుపాము.. (Viral Video)

భారత జట్టు: 

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధు కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

వారు లేకపోవడం పెద్ద లోటే..

ఇక విరాట్, రోహిత్ లేకపోవడం టీమ్‌ఇండియాకు పెద్ద లోటే కానీ.. మిగిలిన ప్లేయర్లకు మంచి అవకాశమని కోచ్ గంభీర్ అన్నాడు. ‘ఆట  ఎప్పుడు మొదలుపెట్టాలి.. ఎప్పుడు ముగించాలనేది వ్యక్తిగతం. కోచ్‌ అయినా.. సెలక్టర్‌ అయినా రిటైర్‌ కావాలని చెప్పే హక్కు లేదు. ఎంతో అనుభవజ్ఞులైన కోహ్లి, రోహిత్‌ ఇప్పుడు టెస్టు జట్టులో లేకపోవడం లోటే. యువకులకు ఇది గొప్ప సువర్ణవకాశం’ అని చెప్పాడు. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభానికి ముందు కూడా బుమ్రా లేని లోటు ఎలా తీరుతుందని తనను ప్రశ్నించారని.. అప్పుడూ ఇదే జవాబు చెప్పానని గౌతి అన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌నకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం మా దృష్టంతా ఇంగ్లాండ్‌ పర్యటనపైనే అని గంభీర్‌ చెప్పాడు. 

Also Read: ఆపరేషన్ సింధూర్ లో 200 మందికి పైగా ఉగ్రవాదులు మృతి..న్యూ అప్డేట్స్ అవుట్

Also Read: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు!

ఇది కూడా చదవండి: తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కావాలా? ఈ 5 ఇంటి నివారణలను ప్రయత్నించండి

 

 

 bcci | inidia-vs-england | team | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు